Khushi : సమంతను వెనుక నుండి హగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. అభిమానులు షాక్..!

మహానటి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమాకి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతిగా ఆరాధ్య అనే పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అయితే ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసింది. నా రోజా నువ్వే అంటూ మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ పాటను విడుదల చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాటకి దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించారు. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సమంతకు తెలియకుండా చేసిన ఓ రీల్ ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

ఇందులో విజయ్ దేవరకొండ సమంతతో ఉన్న క్లిప్స్ ని జతచేసి “నా రోజా నువ్వే” అనే సాంగ్ కి మ్యాచ్ చేశారు. అయితే ఈ వీడియోలో విజయ్ సమంత ను వెనక నుండి వాటేసుకోవడం హైలైట్ గా మారింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జంట సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు