Samantha: విజయ్ దేవరకొండ ఖుషి లేటెస్ట్ అప్డేట్

విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న ఖుషి సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ రాబోతుంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 1న విడుదలవబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ తొందర్లోనే స్టార్ట్ చేయబోతుంది మూవీ యూనిట్.

ఇండియా వైడ్ విజయ్ దేవరకొండకు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను గ్రాండ్ గా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి రాబోయే ఆ లెటెస్ట్ అప్డేట్ మరోదో కాదు ఇటీవలనే విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నా రోజా నువ్వే అనే సాంగ్ ను రిలీజ్ చెయ్యగా, ఆ పాట ఇన్స్టంట్ గా పెద్ద హిట్ అయింది. శివ నిర్వాణ లిరిక్స్ అందించిన ఈ పాటకు యూత్ అంత మెస్మరైజ్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో చాట్ బస్టర్ సాంగ్ ను విడుదల చేయనున్నట్టు మైత్రి మూవీస్ ప్రకటించింది.

గతంలో ఖుషి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేషన్ అబ్దుల్ వాహబ్ చెప్పినట్టు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రెండవ పాటకు కూడా డైరెక్టర్ శివ నిర్వాణనే లిరిక్స్ అందించారు. ఆరాధ్య అని సాగే ఈ పాటను ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ ప్రోమోను మాత్రం ఈ సోమవారం రిలీజ్ చేయనున్నట్టు మైత్రి మూవీస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. ఈ పాటను తెలుగు మరియు తమిళ్ లో టాప్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించనున్నాడు. మరీ ఈ సాంగ్ కూడా మొదటి పాటలాగే సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలంటే జులై 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు