Oppenheimer: నోలన్ మావా సినిమాకు తెలుగులో “A” సర్టిఫికెట్ ఎందుకంటే ?

హాలీవుడ్ లో పేరున్న దిగ్గజ దర్శకులలో క్రిస్టోఫర్ నోలన్ ఒకడు. పట్టుమని పడే పది సినిమాలు తీసిన ఈ ఫిలిం మేకర్, తనదైన ఫిలిం మేకింగ్ టెక్నీక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇండియాలో చూస్తే మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులలో ఈ డైరెక్టర్ సినిమాలకు మహా క్రేజ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈయన అసలు క్రిస్టోఫర్ నోలన్ అయినప్పటి తెలుగు యువత మాత్రం నోలన్ మావా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.

అయితే 2020 ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన టెనెట్ సినిమా తెలుగులో మంచి బుకింగ్స్ ను రాబట్టగా లేటెస్ట్ గా నోలన్ దర్శకత్వంలో రాబోతున్న ఒప్పేన్హిమెర్ సినిమా కూడా ఇండియాలో మరియు తెలుగు రాష్టాల్లో మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. జులై 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో న్యూక్లియర్ వెపన్ పై నడిచే కథగా ఈ సినిమా ఉండబోతుంది.

కాగా ఇటీవలనే ఈ సినిమా ఇండియాలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు ఇండియాన్ సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది. న్యూడిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సర్టిఫికెట్ జారీచేసినట్టు సెన్సార్ టీం తెలిపింది. అయితే ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే నోలన్ సినిమాలో న్యూడిటీ ఉండటమే. దాదాపు ఆయన సినిమాలన్నీ స్క్రీన్ ప్లే బేస్డ్ పై ఉండగా, ఈ సినిమా మాత్రం న్యూడిటీ ఎక్కువగా ఉంది ఏ సర్టిఫికెట్ రావడంతో ఒక్కసారిగా ఏఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో సోషల్ మీడియా అంత ఏం ప్లాన్ చేసావ్ నోలన్ మావా అంటూ మిమ్స్ వేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు