Jailer: అనిరుధ్ మ్యూజిక్ జనాలకు బోర్ కొట్టేసిందా..?

తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేరుకి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ అనిరుధ్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు ఏవైనా లాంచ్ అవుతన్నాయంటే చాలు ఆ హీరోల ఫ్యాన్స్ అంత ఆయా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకోండి అని ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు.

ఇటీవలనే సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒజి సినిమాకైతే ఏకంగా అనిరుధే మ్యూజిక్ చేయాలంటూ పీకే ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేసారు.

కాగా ప్రస్తుతం అనిరుధ్ తెలుగులో ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక తమిళ్ లో రజనీకాంత్ చేస్తున్న జైలర్ సినిమా మరియు తలపతి విజయ్ లియో సినిమాకు , అలాగే శంకర్ దర్శకత్వంలో వస్తోన్న కమల్ హాసన్ ఇండియన్2 లాంటి మోస్ట్ అవైటెడ్ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

అయితే ఇటీవలనే రజనీకాంత్ లేటెస్ట్ సినిమా జైలర్ నుంచి కావాలా అనే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసారు మూవీ యూనిట్. అనిరుధ్ మ్యూజిక్ పై నమ్మకం తెలుగులో ఈ సాంగ్ ఇంకా రాకుండానే తమిళ్ లోనే ఈ సాంగ్ ను అందరువిన్నారు. అయితే కొంతమందికి ఈ సాంగ్ ఎక్కలేదు. దాంతో అనిరుధ్ సరిగా మ్యూజిక్ చేయడం లేదు అంటూ, పాత బీట్స్ నే రిపీట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.

కాగా ఇక్కడ అందరిని ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే, ఇటీవలనే లియో సినిమా నుంచి వచ్చిన నా రెడీ అనే సాంగ్ సూపర్ అంటూ అనిరుధ్ ను ఆకాశానికెత్తిన ఆయన ఫ్యాన్స్ ఈ లేటెస్ట్ సాంగ్ వాళ్ళకి నచ్చకపోవడంతో అనిరుధ్ అవుట్ డేటెడ్ అంటున్నారు. మరీ రకమైన వైఖరిని ఏమనాలో ఎవరికీ అంతుపట్టడం లేదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు