Devara: జాన్వీ కపూర్ వలలో పడిపోయిన మరో యంగ్ హీరో

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలతో బిజీ అవుతుంది. నిన్న, మొన్నటి వరకు బాలీవుడ్ హీరోయిన్స్ ను మేము భరించలేము, మాకొద్దు అంటూ వీళ్ళని పక్కన పెట్టేసిన సౌత్ ఫిలిం మేకర్స్. ప్రస్తుతం సౌత్ సినిమాలకు పెరిగిన క్రేజ్ దృష్ట్యా, పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల కారణంగా బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ను తీసుకోవడం అనివార్యం అయింది.

ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న దేవర సినిమలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ కు ఇంకా ఈ సినిమా రిలీజ్ అవకుండానే టాలీవుడ్ ,కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలనే ఈమెను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న అఖిల్ అక్కినేని ధీర సినిమాలో హీరోయిన్ తీసుకోబోతున్నట్టు టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోలీవుడ్ లో ఒక యంగ్ డైరెక్టర్ కమ్ హీరో కూడా ఆయన సినిమాలో తీసుకుంటే జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా తీసుకుంటా అని పట్టుట్టుకొని కూర్చున్నడటా. ఇంతకీ అతను ఎవరా అనుకుంటున్నారా.

రీసెంట్ తమిళ్, తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ టుడే సినిమాతో సుపరిచితుడైన ప్రదీప్ రంగనాథన్. కోమలి అనే తమిళ్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ టాలెంటెడ్. లవ్ టుడే సినిమాతో హీరో అయిపోయాడు. ఇక ఈ సినిమా హిట్ తరువాత మళ్ళీ డైరెక్షన్ చేస్తాడా, లేక యాక్టింగ్ చేస్తాడా అనే కన్ఫ్యూజన్ లో ఉండగా, ఇటీవలనే ప్రదీప్ తమిళ్ లో హీరోగా ఒక సైన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు గాను జాన్వీ కపూర్ ను హీరోయిన్ తీసుకోబోతున్నట్టు టాక్ వస్తుంది. పైగా ఈ హీరోయిన్ పేరును ప్రదీప్ రంగనాథన్ సజెస్ట్ చేసినట్టు సమాచారం. ఇంకా సౌత్ సినిమాల్లో ఒక్కసారి కూడా కనిపించకుండానే జాన్వీ కపూర్ ఇక్కడి ఫిలిం మేకర్స్ ను తన వలలో పడేలా చేస్తుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు