RC16: రామ్ చరణ్ కోసం బుచ్చి బాబు ప్లానింగ్ అదుర్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం డైరెక్టర్ బుచ్చి బాబు పెద్ద ప్లానులే వేస్తున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ దగ్గర నేర్చుకున్న పని తనని మొత్తం బుచ్చి బాబు దర్శకుడయ్యాక కొంచెం కొంచెంగా బయటికి తీసుకొస్తున్నాడు. పంజా వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ బుచ్చి బాబు తీసిన ఉప్పెన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక, రామ్ చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన ఈ టాలెంటెడ్ దర్శకుడు, ఈ సినిమా కోసం గాను భారీ కసరత్తులు చేస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు రోజురోజుకి వేగవంతం అవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుండగా, దాదాపు ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. రామ్ చరణ్ ఇటీవలనే తండ్రి కావడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం తన భార్య ఉపాసనతో టైం స్పెండ్ చేస్తున్న రామ్ చరణ్ తొందర్లోనే గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

ఇక గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ పూర్తయి, రిలీజ్ డేట్ లాక్ అవ్వగానే బుచ్చి బాబు సినిమా మొదలవనుంది. రురల్ బ్యాక్డ్రాప్ లో ఉండబోయేఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెన కు విజయ్ సేతుపతి మేజర్ ప్లస్ అవ్వగా, రామ్ చరణ్ సినిమాలోను విజయ్ సేతుపతినే విలన్ గా తీసుకోడానికి బుచ్చి బాబు ప్లాన్ చేస్తునట్టు సమాచారం. రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు