SPY: రానా యాక్టర్ గా ఇక పనికి రాడా ?

ఆరడుగులు ఉంటాడు, అందంగా ఉంటాడు, యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు, కావలసినంత ఫ్యామిలీ సపోర్ట్, ఖర్చుపెట్టిన ఈ జన్మకు తరగనంత ఆస్థి ఇవన్నీ ఉన్న కూడా రానా ఎందుకో టాలీవుడ్ లో హీరోగా నిలబడలేకపోతున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఈ సినిమా తరువాత రానా పర్సనాలిటీకి హిందీ సినిమాలలో కూడా అవకాశాలు బాగా వచ్చాయి. ఒక టైం లో అటు తెలుగు, ఇటు హిందీ సినిమాలలో బిజీగా ఉన్న రానా అసలు ఈ మధ్య అడపా, దడపా క్యారెక్టర్ లు క్యామియో అప్పియరెన్స్ లు తప్పిస్తే సోలో హీరోగా సినిమాలు చేయడమే మానేసాడు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో విలన్ గా నటించడం వల్లనో, ఏమోగానీ ఈ సినిమా రిలీజ్ తరువాత నుంచి రానా కెరీర్ గందరగోళంగా తయారైందని చెప్పాలి.

- Advertisement -

అయితే మంచి విషయం ఏంటంటే రానా ఎప్పుడు స్టార్ట్డం కోసం వెంపర్లాడాడు, మంచి సినిమా వస్తే హీరోగా చేయడం, తెలిసిన వాళ్ళు అడిగితే క్యామియో చేయడం, ఎవరు ఏది అడిగిన నో చెప్పకుండా అందరిని కలుపుకుంటూ మనస్తత్వం ఉండటం వల్ల రానా సినిమాలు చేయకపోయిన ప్రేక్షకుల్లో ఆయన అంటే క్రేజ్ మాత్రం ఉంది.

ఇటీవల కాలంలో ఆయన యాక్టింగ్ తో పాటు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తుండగా, కొన్ని చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ, వాటిని ప్రమోట్ చేస్తూ నిన్న మొన్నటివరకు బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం రానా చిన్న సినిమాలు కాకుండా ఒక భారీ బడ్జెట్ పెద్ద సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మాలీవుడ్ స్టార్ హీరో అయిన దుల్కర్ సాల్మన్ తో ఒక భారీ స్థాయి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు ఇటీవలనే ప్రకటించడంతో రానా ఇక తన ఫాదర్ లాగే ప్రొడ్యూసర్ గా సెటిల్ అవ్వాల్సినట్టే తెల్సుతోంది. కాగా రానా తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు