Chiranjeevi : భోళా శంకర్ సెలెబ్రేషన్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళా శంకర్ సినిమా నిర్మాంతర పనులన్నీ ముగించుకొని ఆగస్టు 11న థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూసింగ్ లో వస్తోన్న ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

కీర్తి సురేష్, హీరో సుశాంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా తమన్నా నటిస్తుంది. ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ మరియి ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా, ప్రేక్షకులకు, మెగా స్టార్ అభిమానులకు ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్ లో మెగా స్టార్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులకు మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు.

అయితే ఈరోజు సాయంత్రం 4గంటలకు భోళా శంకర్ సినిమాలోని రెండవ పాటకు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఫుల్ సాంగ్ ను మాత్రం 11 జులై న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ పాట సినిమాలోని సెలెబ్రేషన్ సాంగ్ గా తెల్సుతోంది. గతంలో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా నటించిన పలు సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సినిమాలో కూడా చిరు టాక్సీ డ్రైవర్ గా నటిస్తుండగా, ఆ హిట్ సెంటిమెంట్ భోళా శంకర్ కు కూడా కలిసొస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఆగస్టు 11న థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ బాణీలు సమకూరుస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు