RT4GM: ఊర మాస్ పోస్టర్ తో ఆ మాస్ కాంబినేషన్ అప్డేట్..!

మైత్రి మూవీస్ బ్యానర్ పై మరో మాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. గతకొద్ది రోజులుగా ఈ సినిమా అప్డేట్ ను ఊరిస్తూ, ఊరిస్తూ ఎట్టకేల ఇవాళ ఆ మాస్ కాంబినేషన్ ఏంటో రివీల్ చేశారు. అయితే ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు, మాస్ మహారాజ్ రవితేజ- గోపిచంద్ మలినేని లది.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన గోపిచంద్ మలినేని, రవితేజ హీరోగా వచ్చిన డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.ఈ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించి, రవితేజ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా తరువాత గోపిచంద్ మలినేని వెంకటేష్ తో బాడీగార్డ్ అనే రీమేక్ సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత మళ్ళీ రవితేజ తోనే బలుపు అనే సినిమా చేసాడు. అప్పటిదాకా ప్లాప్ లలో ఉన్న రవితేజ కెరీర్ కు ఈ సినిమా మళ్ళీ హిట్ ను అందించింది.

ఇక ఆ సినిమా తరువాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయ్యారు. మళ్ళీ కొన్నేళ్ల గ్యాప్ తరువాత క్రాక్ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఆశ్చర్యంగా ఈ సినిమా ముందు కూడా రవితేజ కెరీర్ ఫ్లాప్ సినిమాలతోనే ఉంది. ఇలా రవితేజ ఫ్లాప్ లలో ఉన్న ప్రతిసారి గోపీచంద్ మలినేని సినిమాతో రవితేజ సూపర్ హిట్ అందుకోవటం ఆనవాయితీ అయింది.

- Advertisement -

ఇప్పుడు కూడా మళ్ళీ రవితేజ వరుస ఫ్లాప్ లతో సతమతవుతుండగా గోపీచంద్ మలినేని రవితేజతో మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, త్వరలోనే ఈ సినిమా పనులు మొదలవ్వనున్నాయి. అయితే ఈ సినిమా కూడా క్రాక్ లాగే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని ఉండబోతుందని సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు