RT4GM: తలపతి విజయ్ గోపిచంద్ మలినేనితో సినిమా చేయకపోడానికి కారణమేంటి ?

నటసింహం నందమూరి బాలకృష్ణతో వీర సింహ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఆయన తరువాత సినిమా కోసం గాను తమిళ్ స్టార్ యాక్టర్ తలపతి విజయ్ ను కలిసిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై కు వెళ్లి మరీ ఈ దర్శకుడు ఆయనకు కథ వినిపించగా, ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు గాని తరువాత ఈ న్యూస్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు.

అయితే గోపీచంద్ మలినేని కథ చెప్పిన వచ్చిన కొద్దిరోజుల్లోనే తలపతి విజయ్ ఇటీవలనే నాగ చైతన్య హీరోగా కస్టడీ సినిమా తీసిన దర్శకుడు వెంకట్ ప్రభు కలిసి ఆయన సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. దాంతో గోపీచంద్ మలినేనితో విజయ్ ఇక సినిమా చేయట్లేదని కన్ఫామ్ అయిపొయింది. కానీ ఈ విజయ్ ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసాడో ఎవరికీ తెలియడం లేదు.

కాసేపటి క్రితమే గోపీచంద్ మలినేని, మైత్రి మూవీస్ బ్యానర్ లో రవితేజతో సినిమా చేస్తున్నడని అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తలపతి విజయ్ రిజెక్ట్ చేసిన కథనే రవితేజ చేస్తున్నాడా.. ? లేక కొత్త కథనా ? అసలు విజయ్ ఆ కథను ఎందుకు రిజెక్ట్ చేసాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

అయితే నిజమేంటంటే తలపతి విజయ్ తొందర్లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. అందుకుగాను ఆయన ప్రస్తుతం ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా ఉండే సినిమాలు చేయాలనీ చూస్తున్నారట, అందుకే మాస్ సినిమా కాకుండా ఆయన గతంలో నటించిన కత్తి, సర్కార్, లాంటి సందేశాత్మక చిత్రాలలో నటించాలనుకుండటంతో గోపిచంద్ మలినేని కథను విజయ్ రిజెక్ట్ చేసాడని టాక్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు