Rangabali : హద్దులు మీరుతున్న సినీ జర్నలిస్టులు

సినిమాలు హద్దు మీరుతున్నాయి, సినిమాల్లో నాణ్యత లేదు, ఈ సినిమాని సమాజానికి ఉపయోగపడేలా తీయాలంటూ.. సమాజాన్నిఏదో తాము ఉద్ధరిస్తున్నామని ఫీల్ అయ్యే కొంతమంది సినీ జర్నలిస్టులు ఈ మధ్య ప్రెస్ మీట్ లలో అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే మీ సినిమా టైటిల్ లో ఆ పదానికి దీర్ఘం ఎందుకు పెట్టారో చెప్పండి, సినిమాలో ముద్దు పెట్టుకునేటప్పుడు మీ హీరోయిన్ పెదవి వణికిందా, హీరో..హీరోయిన్ ఎడమ చెయ్యి చిటికన వేలే ఎందుకు పట్టుకున్నాడో కొంచెం చెబుతారా..
ఇలా ఉంది కొంతమంది పలు పెద్దమనుషులు అడిగే ప్రశ్నలు తీరు.

ఇక సినిమా ప్రెస్ మీట్ లలో ఈ మహా మహానుభావులు అడిగే ప్రశ్నలు ఎంత చిరాగ్గా ఉంటాయో వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ ల కామెంట్స్ బాక్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. హీరోల, హీరోయిన్స్ లా, డైరెక్టర్ల దృష్టిలో పడాలనే తహ, తహ తప్ప సినిమాపై అభిమానం కొంచెం కూడా ఆ పలు పెద్ద మనుషుల్లో కనిపించడం లేదనే చెప్పాలి. సినిమా వాళ్ళని ఎం అడిగిన, ఏమి మాట్లాడారు అనే ఉద్దేశ్యం బలంగా ఉండటంతో రోజు, రోజుకి ఈ పనికిమాలిన ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంది. మరీ వీళ్లకు కుటుంబాలు ఉన్నయని వాళ్ళు కూడా చూస్తారనే విషయం మర్చిపోయారో లేక మరెంటో అర్థం కావడం లేదు.

పలు సందర్భాల్లో సెలెబ్రెటీలు సైతం వీళ్లకు చురకలు అంటించిన వీళ్ళ వాటిని అలంకారంగా తీసుకుంటున్నారే తప్ప వీళ్ళ బుద్ది మాత్రం మారడం లేదు. పైగా ఈ మహానుభావులు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ లు పెట్టి సెలెబ్రెటీలను ఇంటర్వ్యూ లు కూడా తీసుకుంటూ వ్యూస్ పెంచుకుంటూ, డబ్బు సంపాదిస్తున్నారు. కానీ దరిద్రం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలలో కూడా అదే పనికి మాలిన, దిగజారుడు ప్రశ్నలు అడుగుతూ, ముందు ఉన్న వాళ్ళు మనుషులు అనే ఆలోచనను మర్చిపోతున్నారు. అక్షరం కూడా సిగ్గు పడేలా చేస్తున్న వీళ్ళ బుద్ధిలో ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు