Vijay Devarakonda: ఊహించని క్రేజ్

నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ మళ్ళీ వెనక్కు చూడాల్సిన అవసరంలేకుండా ముందుకు దూసుకెళ్ళాడు. వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు తేడా కొట్టిన విజయ్ కెరియర్ కి ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఇప్పటికే విజయ్ కు అక్కడ భారీ స్పందన వస్తోంది. ముంబైలో జరిగిన లైగర్ ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్‌లో అతనికి లభించిన భారీ ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది.

లైగర్ టీమ్ ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ప్రాంతంలోని ఓ మాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. విజయ్ మరియు టీమ్ లైగర్‌ను పలకరిస్తూ భారీ సంఖ్యలో జనాలు హాజరైన ఈ ఈవెంట్ లో జనాలు చాలా ఎక్కువగా ఉండటంతో, క్రౌడ్ కంట్రోల్ దాదాపు అసాధ్యం అని రుజువు కావడంతో ఈవెంట్ ప్రారంభమైన వెంటనే ఆపివేయవలసి వచ్చింది.

- Advertisement -

మునుపెన్నడూ లేనివిధంగా లైగర్ చిత్రంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించాడు విజయ్. దీనిని బట్టి లైగర్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పొచ్చు. ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 25న లైగర్ భారీ స్థాయిలో పాన్ ఇండియా విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు