NTR30 : ఎట్టకేలకు షూటింగ్ స్టార్ట్?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయి హీరో అయిపోయాడు. తర్వాత వచ్చే సినిమాలపై ఆ ప్రభావం ఉంటుంది. ఆర్ఆర్ఆర్ కు మించిన సినిమా రావాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో NTR30 చేస్తున్న సంగతి విధితమే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న NTR30 ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.

అప్పటి నుంచి షూటింగ్ అప్డేట్ పై నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ స్క్రిప్ట్ పనులు అని, ప్రీ ప్రొడక్షన్ పనులు అని షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అయితే తాజాగా నందమూరి అభిమానులకు కొరటాల శివ గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం అందుతుంది. NTR30 షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశాడట. ఆగస్టు 26వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

కానీ, దీని కోసం ఒక భారీ సెట్ ను తయారు చేస్తున్నారట. సినిమాలోని క్లైమాక్స్ కోసం యాక్షన్ సీన్స్ ను ఈ సెట్ లో చిత్రీకరిస్తారని సమాచారం. అయితే ఎన్టీఆర్ 30 లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. ముందుగా అలియా భట్ ను తీసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి అలియా దూరమైంది. దీంతో మరో హీరోయిన్ వేటలో పడ్డారు. మరి కొరటాలకు బాలీవుడ్ హీరో దొరికిందా, లేదా తెలియాదు. హీరోయిన్ లేకుండా షూటింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు