Venuswamy: మెగా మనవరాలిని కూడా వదలరా..? ట్రోల్స్ వైరల్..!

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఎక్కువగా రాజకీయ నాయకులు , సినీ సెలబ్రిటీల గురించి స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. అప్పుడప్పుడు సెలబ్రిటీల పైన చేసే కామెంట్లు ఈయనను వైరల్ గా మారిస్తే.. మరికొన్ని సందర్భాలలో ట్రోల్స్ కి గురయ్యేలా చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు గోప్యంగా ఉంచాలనుకున్న విషయాలను కూడా పబ్లిక్ లో చెబుతూ … విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు… అంతేకాదు ఒక్కొక్కసారి ఈయన వల్ల బాగుపడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈయనతో రాజేష్ శ్యామల యాగం చేయించుకుని చాలామంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు ..అలా ఈయన ఒక్కోసారి కొంతమంది సెలబ్రిటీలకు లక్కీగా మారితే మరి కొంత మంది జీవితాలను బయటపెట్టి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Venuswamy: Don't leave the mega grand daughter too..?
Venuswamy: Don’t leave the mega grand daughter too..?

ప్రశంసలే కాదు విమర్శలు కూడా..

గతంలో నాగచైతన్య , సమంత విడిపోతారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ఈయన.. అలా చెప్పిన కొంతకాలానికే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. అలాగే విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంటే.. నయనతార ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు.. అన్నట్టుగానే నయనతార ఎన్నో ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉంది.. అంతేకాదు నయనతారకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని , అది ఆమె జాతకంలోనే ఉంది..అందుకే సరోగసి ద్వారా పిల్లలను కనింది అని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు.మరొకవైపు ప్రభాస్ సినిమాలపై జ్యోస్యం చెబుతూ అభిమానులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇక నిన్నటికి నిన్న మెగా కోడలు ఉపాసనపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమెకు మళ్లీ పిల్లలు పుట్టరని కామెంట్లు చేశారు.. అయితే ఉపాసన గత కొద్ది రోజుల క్రితం రెండవ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపిన విషయం తెలిసిందే. అయితే వేణుస్వామి ఇలాంటి కామెంట్లు చేసేసరికి మెగా అభిమానులు వేణు స్వామి పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు మెగా మనవరాలు క్లీంకారపై కూడా ఈయన చేసిన కామెంట్లు మరొకసారి వైరల్ అవుతున్నాయి.. ఈ విషయాలు విన్న చాలామంది మెగా మనవరాలిని కూడా వదలవా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

మెగా మనవరాలు పై షాకింగ్ కామెంట్స్

తాజాగా వేణు స్వామి క్లింకార జాతకాన్ని బయటపెట్టారు.. ఆమె అద్భుతమైన విజయాలను తన జీవితంలో చూస్తుందని.. ఆమె జాతకం చాలా బాగుందంటూ చెప్పడంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్న పిల్ల పుట్టగానే తన జాతకం ఎలా చెబుతావు ? చిన్న పిల్లల జాతకాలు చెప్పకూడదని నీకు తెలియదా? అంటూ భారీ స్థాయిలో విమర్శలు కురిపించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎందుకు మెగా మనవరాలు జాతకం బయట పెట్టారనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.. కేవలం బాలారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు. అది మాకు తెలుసు.. ఒకవేళ అలా చెప్తే వారికి ఉండే గండాల గురించి కూడా చెప్పాలి.. అలా చెప్పడం మరింత ప్రమాదకరంగా మారుతుంది .. కానీ మెగా మనవరాలు జాతకంలో ఎటువంటి అరిష్టాలు లేవు.. ఆమె జాతకం చాలా దివ్యంగా ఉంది ..ఆమె తాత, తండ్రిని మించి గొప్ప జాతకురాలు అవుతుంది అంటూ వేణు స్వామి కామెంట్లు చేశారు.. మొత్తానికైతే వేణు స్వామి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు