Mega Prince: వరుణ్ తేజ్ తో లవ్ స్టోరీ గురించి చెప్పేసిన లావణ్య త్రిపాఠి

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోల వరుస పెళ్లిళ్ల తో సినీ పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. ఇటీవలనే యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి అవ్వగా, రెసెప్షన్స్ వేడుక నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. దాంతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కూడా నిన్న(9/6/23) సాయంత్రమే జరిగింది. దాంతో ఒక్కసారిగా పరిశ్రమ అంతట పెళ్లి సందడి మొదలైంది.

అయితే గతకొద్ది రోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం వరకు ఈ పెళ్లి వార్త గురించి అందరు మాట్లాడుతుండటమే తప్ప , ఈ న్యూస్ పై వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఏ విధంగానూ స్పందించలేదు. దాంతో అందరు కన్ఫ్యూజన్ పడిపోయారు. అయితే ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికి క్లారిటీ నిన్న సాయంత్రం వీళ్లిద్దరి నిశ్చితార్థం తో వచ్చింది. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, మరియు సన్నితుల నడుమ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఉంగరాలు మార్చుకొని ఒక్కటైయ్యారు.

ఈ సంగతంతా బాగానే ఉన్న వీళ్లిద్దరు లవ్ స్టోరీ గురించి మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. కారణం వీళ్లా రిలేషన్ షిప్ గురించి బయట ఎవరికీ తెలియకపోవడమే. సాధారణంగా ఒక హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటాన్నారంటే ఆ విషయాన్నీ సీక్రెట్ ఉంచడం అసాధ్యం అనే చెప్పాలి. కానీ ఈ యంగ్ కపుల్ మాత్రం ఈ అసాధ్యమైన విషయాన్నీ సుసాధ్యం చేసారు. ఎవరికీ అనుమానం రాకుండా, రూమర్స్ గాసిప్స్ కి తావు లేకుండా వీళ్లా రిలేషన్ షిప్ ని కాపాడుకున్నారు.

- Advertisement -

నిజానికి వరుణ్ తేజ్, మరియు లావణ్య త్రిపాఠి రిలేషన్ షిప్ నిన్న మొన్నటిది కాదట. 2016 నుంచే వీరు ప్రేమలో ఉన్నారట. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించగా అప్పుడే వీరిద్దరి లవ్ స్టోరీ కూడా స్టార్ అయిందని నిన్న జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోని లావణ్య త్రిపాఠి షేర్ చేస్తూ “2016 ఫౌండ్ మై ఫరెవర్ ” అని కాప్షన్ పెట్టగా అందరికి వీళ్ళు అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు