Lovely: ఇక్కడ సినిమాలు చేయకపోయినా ఫోటోషూట్స్ తో పలకరిస్తున్న హీరోయిన్

లవ్లీ సినిమాతో తెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన నార్త్ అమ్మాయి శాన్వి శ్రీవాస్తవ. వారణాశి కి చెందిన ఈ హీరోయిన్ తన అక్క విదిష ప్రోత్సాహం తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కొట్టిన ఈ భామ ఆ తర్వాత వరుస ఆఫర్లు చేజిక్కించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో చేయకపోయినా చిన్న హీరోలతో జత కట్టింది. అడ్డా, ప్యార్ మే పడిపోయానే, రౌడీ వంటి సినిమాలు చేయగా, ఈ సినిమాలు అంతగా ఆడలేకపోయాయి. అందువల్ల ఆఫర్లు తక్కువైపోయాయి. అదే సమయంలో కన్నడ లో శాన్వి నటించిన చంద్రలేఖ, మాస్టర్ పీస్ చిత్రాలు సూపర్ హిట్స్ అవ్వడంతో అక్కడే పాగా వేసింది.

ఆ తరువాత తెలుగులో ఛాన్సులు వచ్చినా డేట్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం కారణంగా తెలుగులో సినిమాలు చేయలేకపోయింది. ఇప్పుడు పూర్తిగా కన్నడలోనే సెటిల్ అయిపొయింది శాన్వి. అయితే తెలుగులో సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఆడియన్స్ ని శాన్వి పలకరిస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా శాన్వి చేసిన ఫోటోషూట్ యూత్ ని తెగ అట్ట్రాక్ట్ చేస్తుంది. రెడ్ కార్పెట్ ముందు లైట్ బ్రౌన్ డ్రెస్ లో ఉన్న శాన్వి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక తెలుగు హీరోయిన్లైన లావణ్య, రష్మిక లాంటి హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉండే శాన్వి అప్పుడప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీ ఈవెంట్స్ లో సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ప్రస్తుతం తెలుగు లో ఏ సినిమా కూడా చెయ్యట్లేదు శాన్వి. అయితే గతంలో అతడే శ్రీమన్నారాయణ చిత్ర ప్రమోషన్ లో తెలుగులో తప్పక సినిమాలు చేస్తాను, మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నానంది. అయితే కన్నడలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు