Legend: నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు

నందమూరి బాలకృష్ణ.. తెలుగు చలన చిత్ర చరిత్రలో రెండవ తరం నట శిఖరం. జై బాలయ్య అంటూ తెలుగు సినీ అభిమానుల నోట స్లోగన్ అయిన నందమూరి హీరో ఇతడు. తండ్రి నందమూరి తారక రామారావు లెగసి ని కంటిన్యూ చేస్తూ, నందమూరి నట వారసుడిగా నటసింహం గా తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాడు బాలయ్య. ఈరోజు(జూన్ 10) నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా filmify టీమ్ తరపున విష్ చేస్తూ ఆయన గురించి కొన్ని ప్రత్యేక విషయాలను చెప్పుకుందాం.

నందమూరి తారక రామారావు బసవ తారకం దంపతులకు 1960 జూన్ 10 న జన్మించాడు బాలకృష్ణ. చిన్నతనం నుండే సినిమాలపై ఇష్టంతో నాన్న ఎన్టీఆర్ తో ఎక్కువగా షూటింగ్ లకు వెళ్ళేవాడు బాలయ్య. అది గమనించిన ఎన్టీఆర్ బాలకృష్ణ ను తన స్వీయ దర్శకత్వంలో చేసిన తాతమ్మ కలలో బాల నటుడిగా పరిచయం చేసాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో నటుడిగా నటించాడు.

అయితే 1984 లో వచ్చిన “సాహసమే జీవితం” బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి సినిమా. హీరోగా తొలి మూడు సినిమాలు ఆడలేదు. అయినా పట్టువదలకుండా సినిమాలు చేసాడు. అప్పుడే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “మంగమ్మ గారి మనవడు” చిత్రం తో బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతో బాలకృష్ణ స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే గాకుండా మొదటి గోల్డెన్ జూబ్లీ సినిమాను కూడా పొందాడు. ఆ రోజుల్లోనే ఈ 500రోజులాడింది ఈ సినిమా. కథానాయకుడు, రాము, భార్గవ రాముడు వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన బాలయ్య 1989 లో మళ్ళీ కోడిరామకృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ముద్దుల మావయ్య చిత్రం తో తొలి సారిగా ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు బాలయ్య.

- Advertisement -

ఇక ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచే బాలకృష్ణ 1999లో బి. గోపాల్ దర్శకత్వంలో చేసిన సమర సింహా రెడ్డి, అలాగే 2001 లో వచ్చిన నరసింహ నాయుడు సినిమాల్తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు బాలయ్య. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎలాంటివైనా సరే క్షణం ఆలోచించకుండా సిద్ధపడే అతికొద్దిమంది హీరోల్లో బాలకృష్ణ ఒకరు. అలాంటి ఆలోచనల నుండి వచ్చిందే భైరవ ద్వీపంలోని కురూపి పాత్ర. ఆ వేషంలో బాలకృష్ణ నటనకి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే. ఇక ప్రయోగాలకి పెద్దపీట వేసే బాలయ్య ఆదిత్య 369 వంటి టైమ్ ట్రావెల్ చిత్రాల్లో నటించడమే గాకుండా మేకప్ కూడా వేసుకోకుండా అందులో కనిపించారు.

ఇక హీరోగా సీనియర్ హీరో అయిన తర్వాత బాలకృష్ణ లెజెండ్, గౌతమి పుత్ర శాతకర్ణి, అఖండ, వీరసింహారెడ్డి వంటి సినిమాల్తో యంగ్ హీరోలకి సైతం పోటీనిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్న బాలయ్య దసరా కి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇక బాలకృష్ణ సాయం గురించి అందరికి తేలిసిందే. ఎంతో మందికి గుప్త దానాలు చేసిన ఆయన ఎక్కడా చేసిన మేలు గురించి చెప్పుకోరు. ఇక తన తల్లి పేరు మీద బాలకృష్ణ ఏర్పాటు చేసిన “బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్” ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ అభిమానులకు, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి పుట్టిన రోజులు బాలకృష్ణ మరెన్నో జరుపుకోవాలని, మళ్ళీ మళ్ళీ తన సినిమాలతో అభిమానుల్ని పలకరించాలని కోరుకుంటూ బాలకృష్ణ కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు