Vijay : మొత్తం తెలుగు రాష్ట్రాలే

తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి ఇటీవల వచ్చిన “బీస్ట్” ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “వారీసు”. తెలుగులో ఈ చిత్రాన్ని “వారసుడు” గా తెరకెక్కిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ డ్రామా కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రభు, శరత్ కుమార్, సంగీత, సంయుక్త, యోగి బాబు తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విజయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ కాలేజీ కుర్రాడిగా.. ఆ తరువాత ఓ ఫుడ్ కంపెనీ ఓనర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోనే షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్ శివారులో కొన్ని ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది.

మరో వారం రోజులపాటు ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో కొనసాగనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపే ప్రయత్నం చేస్తుంది చిత్రబృందం. మరి ఈ “వారసుడు” ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో తెలియాలంటే సినిమా పూర్తయి రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు