NBK108 : బాంబార్డింగ్ త్వరలోనే..

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 108వ సినిమా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. NBK108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజునే అధికారికంగా ప్రకటించారు. కానీ, NBK107 షూటింగ్ లో బాలయ్య ఉండటంతో ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

బాలకృష్ణ,అనిల్ రావిపూడి, ఎస్ థమన్ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ కాంబో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. నటసింహ నందమూరి బాలకృష్ణని మునుపెన్నడూచూడని పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తుంది. దీనికి బ్రో, ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ను అనిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

అయితే NBK108 అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అవుతుంది. కానీ, సినిమా నుంచి అప్ డేట్స్ రాలేదు అనే నిరాశలో నందమూరి అభిమానులు ఉన్నారు. దీంతో అనిల్ రావిపూడి తాజాగా నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. దీని ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు. “త్వరలో బాంబార్డింగ్” అంటూ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియో ని విడుదల చేశారు. అనౌన్స్ మెంట్ వీడియోకు థమన్ ఇచ్చిన బిజీఎం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అనౌన్స్ మెంట్ వీడియోకే బిజీఎం ఈ రేంజ్ లో ఉంటే, సినిమాతో ఏ స్థాయిలో ఉంటుందనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకుల్లో ఉంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు