Sandalwood: మసి ఎంత ఎక్కువుంటే.. అంత పెద్ద విజయం

హీరోలు అంటే.. స్టైల్ గా కనిపించాలి. హీరోయిన్లు అంత కంటే స్టైల్ గా కనిపించింలి.. అందంగా కనిపించాలి. ప్రతి ఒక్కరి ఫేస్ లో రిచ్ నెస్ ఉండాలి. ఇలాంటి ప్రమాణాలు సినిమాలో ఉపయోగిస్తే మంచి హిట్ అవుతుంది. ఇది ఓల్డ్ ట్రెండ్. ప్రస్తుతం హీరోలు, విలన్లు మసి పూసుకుని ఉండాలి. హీరోయిన్లు కూడా అంతే… డీ గ్లామర్ గానే కనిపించాలి. స్క్రీన్ పై నల్లటి మసి తప్పమరేది కూడా కనిపించొద్దు. ఇలా ఉంటానే ఈ రోజులు సినిమాలు హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా శాండిల్ వుడ్ సినిమాలు.

సినీ ప్రపంచంలో కనిపించి.. కనిపించకుండా ఉండే ఇండస్ట్రీ శాండిల్ వుడ్. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు సినీ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది అంటే.. దానికి కారణం కేజీఎఫ్ సిరీస్. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనంగా మారింది. ఈ సినిమాలో హీరో చాలా వరకు మసి పూసుకునే కనిపిస్తాడు. దీని తర్వాత ఇటీవల వచ్చిన విక్రాంత్ రాణా కూడా దాదాపు అలాంటి సినిమానే. కేజీఎఫ్ కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ తీయబోతున్న సలార్, NTR31 లు కూడా అదే కోవకు చెందినవి అని ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ వల్ల తెలిసిపోతుంది.

తాజాగా ఉపెంద్ర హీరోగా వస్తున్న కబ్జా చిత్రం కూడా దాదాపు అలాంటిదే అని ఇటీవల వచ్చిన ట్రైలర్ తో కన్ఫామ్ అయిపోయింది. డైరెక్టర్లు మారుతున్నా… ఈ మసి పూసుకునే కాన్సెప్ట్ అయితే మారడం లేదు. కబ్జా ట్రైలర్ చూస్తే.. స్వతంత్ర పూర్వం బ్రిటీష్ కాలంలో జరిగిన కథ అని తెలుస్తోంది. నిజానికి స్వతంత్రానికి పూర్వం అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలనే నమోదు చేశాయి.

- Advertisement -

కబ్జాకు కూడా అలాంటి విజయం దక్కే ఛాన్స్ కూడా ఉంది. అయినా, డైరెక్టర్ చంద్రూ.. కన్నడ ఇండస్ట్రీకి కలిసొచ్చే మసిని కాస్త ఎక్కువే వాడారని తెలుస్తోంది. ఎంత ఎక్కువ మసి వాడితే అంత పెద్ద విజయం దక్కుతుందని అనుకున్నారేమో.. ట్రైలర్ ని చూస్తే బ్లాక్ అండ్ వైట్ మూవీ చూస్తున్నట్టు అనే ఫీల్ వస్తుంది. మరి ఈ మసి కబ్జాకి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు