Parineeti Chopra: పెళ్లిపై ముచ్చటపడుతున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ లో వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్స్ లలో పరిణీతి చోప్రా ఒకరు. గతేడాది కోడ్ నేమ్: తిరంగా, ఉంచై లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరిణీతి ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తుంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న యానిమల్ సినిమాలో కూడా ఈమె కీలక పాత్ర చేస్తోంది.

అయితే 34 ఏళ్ల ఈ భామ ఇంకా పెళ్లి చేసుకోలేదు. సందర్భం వచ్చిన ప్రతి సారి మీడియా నుంచి పరిణీతి పెళ్లిపై ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల బాలీవుడ్ స్టార్స్ రణబీర్ – ఆలియా, సిద్ధార్థ్ – కియారా అద్వానీ, అతియా శెట్టి – కేఎల్ రాహుల్ పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. కో స్టార్స్ ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతుంటే, ఈ భామకు పెళ్లి గురించి వచ్చే ప్రశ్నలు కూడా పెరిగిపోతున్నాయి.

తాజాగా దీనిపై పరిణీతి చోప్రా స్పందించింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, అలాగే తాను మంచి వైవాహిక జీవితం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపింది. వాళ్లు చాలా ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని, తనకు అలాంటిది పరిస్థితి లేదని చెప్పుకొచ్చింది. కోరుకున్న వ్యక్తి వస్తే తప్పకుండా ప్రేమిస్తానని, పెండ్లి చేసుకుంటానని వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి నా జీవితంలో కనిపించలేదని వివరించింది. అయితే తనకు పెళ్లి చేసుకోవాలని, పిల్లలతో ఆడుకోవాలని ఆశగా ఉందని చెప్పింది.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు