Poonam Kaur: నేను తెలంగాణ బిడ్డనే.. నన్ను గుర్తించండి

నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో ఒక అప్డేట్ తో కానీ స్టిల్ తో కానీ నెటిజన్లను పలకరిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, తన పేరు దెబ్బతిందని ఇప్పటికే చెప్పుకొచ్చిన విషయం విధితమే. ముఖ్యంగా గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. అయితే సోమవారం రాజభవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పూనమ్ కౌర్ కూడా పాల్గొన్నారు.

ఆమె మాట్లాడే సందర్భంలో “నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయినని ఎప్పుడు చెబుతుంటారు. నేను ఇక్కడే పుట్టాను, పెరిగాను. నా మతం నన్ను నా రాష్ట్రం నుంచి వేరు చేయదు. మీ అందరి లాగానే నేను తెలంగాణ బిడ్డని. నేను మైనారిటీ సిక్కు అమ్మాయినని చెప్పి వేరు చేస్తున్నారు” అని ఎమోషనల్ అయ్యారు.

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పూనమ్ కౌర్ తెలంగాణపై చేసిన సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, పూనమ్ కౌర్ ఈ మాటలు అనడానికి ముందు అదే వేదికపై మాట్లాడారు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై. తెలంగాణ గడ్డపై ఆమె ఇప్పటికే అనేక అవమానాలు భరించినట్లు చెప్పారు. ఆ మాటలకు సంఘీభావం తెలుపుతూ పూనమ్ కూడా తన ఆవేదన వెళ్ళగాక్కారు. గవర్నర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వెళ్లగక్కిన పూనమ్ ‘మేడమ్.. మీ మాటలు అక్షర సత్యం’ అంటూ మద్దతిచ్చారు పూనమ్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు