Trivikram: హ్యాట్రిక్ హిట్స్ తరువాత

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పేరు ను కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం. తెలుగు సినిమా మాటలు ఇలా కూడా రాయొచ్చు అని కొత్తగా పరిచయం చేసిన దర్శకుడు త్రివిక్రమ్. కేవలం తన మాటలకోసమే సినిమాలకు వెళ్లే ఆడియన్స్ ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు.
స్వయంవరం సినిమాతో రచయిత తన కెరియర్ ప్రారంభించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు.

త్రివిక్రమ్ దర్శకుడుగా మారిన అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. చేసిన హీరోస్ తోనే సినిమాలు చేయడం త్రివిక్రమ్ కి ఒక అలవాటుగా మారింది. పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలను చేసాడు త్రివిక్రమ్. ఇప్పటికే మహేష్ తో రెండు సినిమాలను చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం SSMB28సినిమాను. ఈ సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదివరకే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలతో బన్నీ కి హ్యాట్రిక్ హిట్ సినిమాలను ఇచ్చాడు త్రివిక్రమ్.
ఇప్పుడు బన్నీతో చేయబోయే సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ను తీసుకురానున్నాడు త్రివిక్రమ్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అని తెలుస్తోంది. ఇదివరకే బన్నీకి త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు