BIG breaking : టాప్ ఫైవ్ తెలుగు మూవీస్ ఇవే

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు రెకాగ్నేషన్ లభించిన అందరికి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోతున్న సినిమాలకు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదువరల్డ్ వైడ్ గా ఉన్న సినీ అభిమానులంతా టాలీవుడ్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఇటీవలనే 2023-24 సంవత్సరానికి సంబంధించి మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాల లిస్ట్ విడుదల అవ్వగా.. ఈ లిస్ట్ లో అయిదు ప్రతిష్టాత్మకమైన సినిమాలకు చోటు దక్కింది. ఓర్మాక్స్ మీడియా స‌ర్వే ప్రకారం ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్ లో వస్తోన్న సలార్ సినిమాకు చోటు లభించింది. హై ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తునట్టు ఓర్మాక్స్ మీడియా తమ సర్వేలో తెలియజేసింది.

అలాగే రెండవ స్థానంలో సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప -2 అని వెల్లడించింది. రీజినల్ సినిమాగా రిలీజై, ఇండియా వైడ్ గా పుష్ప పార్ట్ -1 పాపులర్ అవడంతో పుష్ప పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవలనే రిలీజ్ చేసిన ఈ సినిమా గ్లిమ్స్ వీడియో ప్రేక్షకుల అంచనాలను ఇంకా పెంచింది. ఇక మూడవ స్థానంలో యంగ్ డైరెక్టర్ సుజీత్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న OG సినిమా నిలిచింది. అలాగే నాలుగవ స్థానంలో మహేష్- త్రివిక్రమ్ గుంటూరు కారం. అయిదవ స్థానంలో కొరటాల శివ- ఎన్టీఆర్ ల దేవర సినిమాలకు మోస్ట్ అవైటెడ్ టాప్ ఫైవ్ తెలుగు సినిమాల్లో చోటు లభించాయి,

- Advertisement -

కాగా ఇటీవలనే రిలీజైన ప్రభాస్ కల్కి సినిమాకు టాప్ ఫైవ్ లో చోటు లభించకపోవడం గమనార్హం. గూగుల్ సెర్చ్ మరియు సోషల్ మీడియా పోల్స్ ద్వారా ఈ డేటా సేకరించడం జరిగిందని ఓర్మాక్స్ మీడియా తెలిపింది. అలాగే తెలుగుతో పాటు ఇండియాస్ వైడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా లిస్ట్ కూడా ప్రకరించగా ఈ లిస్ట్ లో పుష్ప, OG సినిమాలకు ఇందులో చోటు లభించింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు