Mehar Ramesh: భోళా శంకర్ ట్రైలర్ అప్డేట్.. అసలు లెక్క ఆరోజే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “భోళా శంకర్” ఆగష్టు11 న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడంతో పోస్ట్ డబ్బింగ్ పనులపై దృష్టి పెట్టారు చిత్ర యూనిట్. ఇప్పటికే చిరంజీవి తో పాటు, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ల డబ్బింగ్ పూర్తవగా, ఇతర నటీనటులకి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసేసి సెన్సార్ కి పంపించే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక తాజాగా భోళా శంకర్ కి సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని జూలై 27న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ మరియు పాటలలో చిరంజీవి మినహా వేరే ఏ అంశం పెద్దగా ఆకట్టుకోలేదు. మ్యూజిక్ కూడా డీసెంట్ అనిపించుకోగా పెద్దగా అంచనాలేమి రాలేదు. దానికి మెహర్ రమేష్ దర్శకుడనే కారణం ఒకటైతే, రీమేక్ సినిమా కావడం మరో కారణం.

అయితే భోళా శంకర్ కి సరైన హైప్ అయితే రాలేదు గాని, నెగిటివ్ రెస్పాన్స్ అయితే లేదు. అయితే ఇప్పుడు రాబోతున్న ట్రైలర్ పైనే అందరి ఆసక్తి నెలకొనే ఉంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే దాని వల్ల అందరి కంటే ఎక్కువ ప్లస్ అయ్యేది మెహర్ రమేష్ కే. ఈ సినిమా హిట్ అయితే అంతకన్నా అద్భుతం ఉండదంటున్నారు నెటిజన్లు. దానికన్నా ముందు ఆ రేంజ్ హైప్ రావాలంటే జూలై 27న విడుదల చేస్తున్న ట్రైలర్ రెస్పాన్స్ చాలా కీలకం కానుంది. ట్రైలర్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి భోళా శంకర్ బిజినెస్ లెక్కలు కూడా తారుమారయ్యే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు