BABY : విశ్వక్ సేన్ VS బేబీ డైరెక్టర్- ముదురుతున్న ట్విట్టర్ వార్

బేసిక్ గా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు ఎదో ఒక కాంట్రవర్సీ చేయకుండా నిద్ర పట్టదు. ఎప్పుడు ఎవరో ఒకరిని గెలకాలి వాళ్ళతో తగాదా పెట్టుకోవాలి. ఆ తగాదాను వైరల్ చేసి, అందరు తన గురించి మాట్లాడుకునెలా చేయాలి. గత కొద్దీ కాలంగా విశ్వక్ సేన్ వైఖరి ఇలాగే ఉంది. కెరీర్ బిగినింగ్ నుంచే స్టేజ్ పై మైక్ పట్టుకొని నోటికొచ్చినట్టు వాగి, వాటివల్ల వైరల్ అయ్యి ఇప్పుడు హీరోగా చెలామణి అవుతున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ గా మరో వివాదానికి తెర లేపుతున్నాడు.

విషయానికొస్తే ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న స్టోరీలు రకరకాల పరిస్థితుల వల్ల, కారణాల వల్ల వేరే హీరోలు చేయవలసి వస్తుంది. ఇది పరిశ్రమలో జరగడం సర్వ సాధారణం. అయితే ఇలాంటి కొన్ని విషయాలు బయటికి వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకుల్లో వీటిని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

ఇటీవలనే సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీడియం రేంజ్ సినిమాలలో అతి తక్కువ సమయంలో 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా రిక్డార్ కూడా క్రియేట్ చేసింది ఈ బేబీ. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా నిజానికి సాయి రాజేష్ విశ్వక్ సేన్ కు చెబుదామని అనుకున్నాడట. రెండు మూడు సార్లు విశ్వక్ ను కలసి స్టోరీ చెప్పడానికి ప్రయత్నించగా విశ్వక్ సేన్ స్టోరీ కూడా వినకుండా ఛీ వాడితో సినిమా అంటే అస్సలు చేయను అని సన్నిహితులతో చెప్పాడంట.

- Advertisement -

ఇక ఆ విషయం తెలుసుకున్న సాయి రాజేష్ విశ్వక్ కు స్టోరీ చెప్పే ప్రయత్నం మనుకున్నాడట. అయితే ఈ విషయాన్ని ఇటీవలనే సాయి రాజేష్ బేబీ సక్సెస్ మీట్ స్టేజ్ పై విశ్వక్ పేరు చెప్పకుండా ఒక హీరో నన్ను రిజెక్ట్ చేశాడంటూ క్యాజువల్ గా చెప్పాడు.

ఇక ఈ విషయానికి హర్ట్ అయిన ఆటిట్యూడ్ స్టార్ విశ్వక్ సేన్ ట్విట్టర్ లో సాయి రాజేష్ ను టార్గెట్ చేస్తూ “నో అంటే నోనే.. అది మగాడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేసి.. కూల్ గా ఉందాం. మనమంతా ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మనశాంతి, విశ్రాంతి తీసుకోండి అని ట్విట్ చేయగా ఇది వైరల్ అయింది.

ఇక దీనికి కాంటర్ గా సాయి రాజేష్ కూడా “చూస్తున్న నీ ట్విట్స్ గో ఎహెడ్ ” అంటూ ట్వీట్ చేయడంతో వివాదం కొంచెం కొంచెం గా ముదురురుతు వస్తుంది. సినిమా చేయడం ఇష్టం లేనప్పుడు, చేయకుండా ఉన్నాడు సరే సరి మళ్ళీ గెలుక్కోడానికి కాకపోతే విశ్వక్ ఈ రకమైన చీప్ కామెంట్స్ చేయడం ఎందుకు అని అనుకుంటున్నారు నెటిజన్లు. మరీ ఈ వివాదం ఎంతవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు