Happy Birthday: విజువల్ వండర్స్ కి కేరాఫ్.. కోడి రామకృష్ణ..

టాలీవుడ్ లో శతాధిక దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ చిత్రాల దర్శకుడిగా, విజువల్ వండర్ మూవీస్ కి కేరాఫ్ గా నిలిచిన ఆయన 90స్ లోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసారు. అయినా ఈ తరం ఆడియన్స్ కి తెలియాలంటే “అరుంధతి” లాంటి ఒక్క చిత్రం చాలు. ఈరోజు కోడి రామకృష్ణ జయంతి. ఈ సందర్భంగా filmify టీమ్ తరపున ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఈ తరం ఆడియన్స్ కి కోడి రామకృష్ణ గురించి తెలియని కొన్ని విషయాలని చర్చించుకుందాం.

విభిన్న చిత్రాలు తీసే కోడి రామకృష్ణ ఎక్కువగా ఫేమస్ అయ్యింది మాత్రం గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చిన చిత్రాలతోనే. దాసరి నారాయణరావు శిష్యుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీకి గోల్డెన్ జూబ్లీ అందించాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు ఇండస్ట్రీ లో ఎన్నో సంచలనాలకు దారి తీసింది. ఈ సినిమా నుండే టాలీవుడ్ లో గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమాలు రూపొందడం స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అయినపుడు చాలా థియేటర్లలో కొంతమంది మహిళలకు అమ్మోరు పూనిందని అప్పటి ప్రజలు చెప్పుకుంటారు.

ఇక బాలకృష్ణ ని స్టార్ హీరోగా మార్చిన ఘనత కోడి రామకృష్ణదే. ఈయన దర్శకత్వంలో వచ్చిన “మంగమ్మ గారి మనవడు” చిత్రంతోనే బాలకృష్ణ మొదటి బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. అటు పిమ్మట ముద్దుల మావయ్య చిత్రంతో తొలి ఇండస్ట్రీ హిట్ ని అందించాడు.

- Advertisement -

టాలీవుడ్ లో గ్రాఫిక్స్ చిత్రాలకి కేరాఫ్ అయిన కోడి రామకృష్ణ అమ్మోరు, దేవి, దేవి పుత్రుడు, అంజి, అరుంధతి, నాగ భరణం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తో తీసిన అంజి సినిమా ఆరోజుల్లోనే దాదాపు ఆరేళ్ళు షూటింగ్ జరుపుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ బ్యాడ్ టాక్ తెచ్చుకున్నపుడు, గ్రాఫిక్స్ పరంగా ఆడియన్స్ అంజి సినిమాతో కంపేర్ చేసి బాలీవుడ్ వాళ్ళని నేర్చుకొమ్మన్నారంటే ఆ రోజుల్లోనే కోడి రామకృష్ణ పనితనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈయన తెరకెక్కించిన “అరుంధతి” చిత్రం మరో ఎత్తు. టాలీవుడ్ కి జేజమ్మ గా అనుష్క శెట్టి ని స్టార్ హీరోయిన్ ని చేసిన అరుంధతి తనకే, కాదు విలన్ గా సోనూసూద్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక సోను సూద్ పశుపతి పాత్రకి డబ్బింగ్ చెప్పిన రవి శంకర్ కి స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు దక్కగా, ఈ చిత్రం తర్వాత ఆయన వెయ్యికి పైగా చిత్రాలకి డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇప్పటికీ అనుష్క గాని, రవి శంకర్ గాని ఏ ఈవెంట్ కి వెళ్లినా తమకింత గుర్తింపు రావడానికి కోడి రామకృష్ణే కారణమని ఎన్నోసార్లు చెప్పారు.

ఇక కోడి రామకృష్ణ తీసిన చివరి చిత్రం “నాగాభరణం”లో కూడా కన్నడ స్టార్ దివంగత విష్ణువర్ధన్ ని CGI గ్రాఫిక్స్ ద్వారా రీ క్రియేట్ చేసి సినిమాలో పాత్ర డిజైన్ చేసారు. ఈ విధంగా చనిపోయిన వ్యక్తిని గ్రాఫిక్స్ ద్వారా సినిమాలో బతికించడం ఇండియాలో మొదటి సారి చేయడం జరిగింది. ఇలాంటి ప్రయోగాలెన్నో చేసిన ఆయన 2019లో బ్రీతింగ్ ప్రాబ్లెమ్ వల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. అయినా కోడి రామకృష్ణ తన సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని ఎల్లప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు