Pawan kalyan: “బ్రో” లో అలాంటివి లేకపోతే చాలు అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీయెస్ట్ సినిమా “బ్రో” అని మనందరికీ తెలిసిందే. ఆదిపురుష్ సినిమా తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా “బ్రో” కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ఉన్న ఏకైక అతిపెద్ద బలం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా రీమేక్ అయినా కూడా, త్రివిక్రమ్ శ్రీనివాస్ చొరవతో స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెరకెక్కించారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్, తో పాటు ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో భారీ రిలీజ్ కి ప్లాన్ చేసారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకి స్పెషల్ షోలు మాత్రం వెయ్యట్లేదు. టికెట్ రేట్లు కూడా నార్మల్ గానే పెట్టారు మేకర్స్. పవన్ కళ్యాణ్ గత చిత్రాలకి వచ్చిన రాజకీయ ఇబ్బందుల కారణంగా మేకర్స్ ఈ డెసిషన్ ని తీసుకున్నట్టు తెలిసింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి ఒక టాపిక్ వైరల్ అవుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో అత్తారింటికి దారేది , సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాత వాసి లాంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ పాత పాటలకి స్టెప్స్ వేయడం, లేదా జానపద పాటల్ని పాడుతూ డాన్స్ జరిగింది. అయితే అది కొన్ని సార్లు సినిమాకి ప్లస్ అవగా, మరికొన్ని సార్లు వాటి వల్లే మరింత బ్యాడ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.

- Advertisement -

ఇప్పుడు తాజాగా వస్తున్న బ్రో సినిమాలో కూడా అలాంటి ప్రయోగం చేసారని టాక్ నడుస్తుంది. తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ లో కూడా చివర్లో పవన్ కళ్యాణ్ పాత పాటలు వినబడ్డాయి. ఇది గమనించిన పీకే ఫ్యాన్స్ తమ మళ్ళీ అలా పాత సినిమాల ట్రాక్ లని పెట్టొద్దని, ఒకవేళ పెడితే ఎడిట్ చేసి తీసెయ్యమని, సోషల్ మీడియా లో మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి నిజంగా బ్రో సినిమాలో అలాంటి ప్రయోగం చేసారో లేదో తెలియాలంటే, మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు