Tollywood : ఒక్కో మిడ్ రేంజ్ హీరోకు ఒక్కో స్టార్ హీరో సపోర్ట్… ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?

Tollywood : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో పాన్ ఇండియా హీరో ఒక్కో మిడ్ రేంజ్ హీరోకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న ఈ ఆసక్తికరమైన పరిణామాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు కరువయ్యారు. అయితే పాన్ ఇండియా హీరోలు లేదా మిడ్ రేంజ్ హీరోలు మాత్రమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. సీనియర్ హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళ జోరు అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు ఒక్కొక్కరూ ఒక్కో మిడ్ రేంజ్ హీరోకు సపోర్ట్ చేస్తూ, వాళ్లలోని టాలెంట్ కు మరింత పదును పెట్టే పనిలో నిమగ్నం అయిపోయారు.

  1. చిరంజీవి – తేజ సజ్జ

మెగాస్టార్ చిరంజీవి అందరివాడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది ఇండస్ట్రీలోని మిడ్ రేంజ్ హీరోలు మెగా సపోర్ట్ కోసం తహతహలాడుతారు. ట్యాలెంట్ ఉంటే సపోర్ట్ చేయడానికి చిరు కూడా వెనుకాడరు. కానీ తాజాగా తేజ సజ్జకు ఊహించని విధంగా మెగా కాంపౌండ్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. హనుమాన్ మూవీ రిలీజ్ టైంలో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదేమో అని తెగ టెన్షన్ పడ్డారు చిత్ర బృందం అంతా. కానీ అనుకోని విధంగా మెగాస్టార్ తెరపైకి వచ్చి తేజ సజ్జకు సపోర్ట్ చేశారు. ఇక తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో తేజ సజ్జను ఆకాశానికి ఎత్తేసారు మెగాస్టార్. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా స్వయంకృషితో తేజ ఎదుగుతున్నాడని, అతను మంచి ట్యాలెంట్ ఉన్న నటుడని ప్రశంసలతో ముంచెత్తారు.

- Advertisement -

2. ఎన్టీఆర్ – సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్

ఇక టాలీవుడ్ లో ఉన్న మరో ఇద్దరు టాలెంటెడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్. వీరిద్దరికి తాజాగా ఎన్టీఆర్ అండగా నిలబడ్డారు. టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తారక్ ఇద్దరు హీరోలను ఇంటికి పిలిచి మరి పార్టీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా టిల్లు స్క్వేర్ వేదికపై సందడి చేసి సిద్దుకు ఫుల్ సపోర్ట్ అందించారు. ఇక ఈ జోష్ లోనే విశ్వక్సేన్ కూడా తారక్ కు దగ్గర అయినట్టుగా కనిపించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన గామి మూవీ గురించి ఇండస్ట్రీలోని పెద్దలు ఎవ్వరూ మాట్లాడకపోవడం, అదే సమయంలో రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ ప్రేమలు మూవీకి రాజమౌళి సపోర్ట్ చేయడం తెలిసిందే. ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు తమ ప్రయోగాన్ని కూడా అభినందిస్తే బాగుంటుందని విశ్వక్సేన్ మీడియా వేదికగా కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ తో కలిసి కనిపించడం ఇంట్రెస్టింగ్ విషయం.

3. మహేష్ బాబు – కార్తికేయ గుమ్మకొండ

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా బాగుంటే సోషల్ మీడియా వేదికగా హీరో ఎవరైనా సరే ప్రశంసించడానికి వెనకాడరు. ఇప్పటికే ఆయన ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్లలో పాల్గొని ఫుల్ సపోర్ట్ చేశారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండకు మద్దతుగా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న భజే వాయువేగం మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు రిలీజ్ చేస్తూ, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకోవడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు