Ram Charan vs Allu Arjun : మళ్లీ ఇదే చర్చ… ఎవరు గొప్ప…?

Ram Charan vs Allu Arjun : టాలీవుడ్ హీరోల్లో ఎవరు గొప్ప…? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక హీరో సినిమా రిలీజ్ అయినా, దాని సాంగ్, టీజర్, ట్రైలర్ అంత ఎందుకు ఓ పొస్టర్ రిలీజ్ అయినా, సోషల్ మీడియాలో ఏదో ఒక మూలన ఈ చర్చ తప్పకుండా దర్శనమిస్తుంది.

ఈ చర్చ మరొక విషయంలో కూడా కనిపిస్తుంది. అదే మెగా కంపౌండ్‌లో ఏ హీరో గొప్ప…? ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చింది. అదే టైంలో వచ్చిన పుష్ప మూవీతో అల్లు అర్జున్‌కు ఐకాన్ స్టార్ అనే గుర్తింపు వచ్చింది. ఇంకా చెప్పాలంటే…

  • ఈ సినిమాలతో ఇద్దరికీ క్రేజ్ పెరిగింది.
  • అభిమానులు పెరిగారు.
  • స్టార్ స్టేటస్ పెరిగింది.
  • వీటి అన్నింటితో పాటు వీరి ఫ్యాన్స్ మధ్య గ్యాప్ కూడా పెరిగింది.
  • ఇలా అన్ని పెరగడంతో వీరిపై చర్చ కూడా పెరిగింది.

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య పడటం లేదని, ఒకరిపై ఒకరు కోపంతో ఉన్నారని ఎప్పటికప్పుడు గాసిప్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. కానీ, రామ్ చరణ్ – అల్లు అర్జున్ ఇవేమీ పట్టించుకోకుండా తమ సినిమాల్లో బిజీగా ఉంటూ తమ మధ్య బాండింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ, సందర్భం వచ్చిన ప్రతి సారి కలుస్తూ ఉంటున్నారు.

- Advertisement -

పుష్ప 2 బిజినెస్‌తో మళ్లీ ఈ చర్చ…

పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ ఆగస్టు 15న పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. దీంతో ఇప్పటి నుంచే బిజినెస్ లెక్కల గురించి చర్చ జరుగుతుంది. పుష్ప తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్డ్ స్టేట్స్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప 2పై హైప్ చాలా ఎక్కువ ఉంది. దీంతో బిజినెస్‌ కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే ఇప్పుడు ఎవరు గొప్ప…? అనే చర్చకు దారి తీసింది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా…

పుష్ప 2 సినిమాకు భారీగా బిజినెస్ జరగబోతుందని, దాన్ని అందుకోవడం రామ్ చరణ్ కు కష్టమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీకి మంచి బిజినెస్ జరిగినా, అది మొత్తం రామ్ చరణ్ ఖాతాలో వేయలేమని, ఆ సినిమాకు హైలైట్ రాజమౌళి అని చెబుతున్నారు. ఇంకా ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ హీరో అని, అందువల్లే అంత బిజినెస్ జరిగిందని, దీనిలో రామ్ చరణ్ ది ఏం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్ ఫ్యాన్స్ అలా…

దీనికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కౌటర్ ఇస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్ అని, అలాగే రాబోయే గేమ్ ఛేంజర్ మూవీ అన్నింటికీ సమాధానం ఇస్తుంది అంటూ బన్నీ అభిమానులకు కౌంటర్ ఇస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు