Pooja Hegde New House : బాంద్రా ఇల్లు కొన్న పూజా… ఈ లగ్జరీ కాలనీలో ఉన్న సెలబ్రెటీలు వీళ్లే

Pooja Hegde New House : ఇక ఈమె కెరీర్ ముగిసినట్టే అని అనుకుంటున్న తరుణంలోనే అటు సౌత్ ఇటు నార్త్ నుంచి వరుస అవకాశాలను అందుకుంటుంది పూజా హెగ్డే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏకంగా 45 కోట్లు పెట్టి ముంబైలోని లగ్జరీ ఏరియా బాంద్రాలో ఇల్లు కొని హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ అగ్రతారలంతా కొలువుండే ప్రదేశమే బాంద్రా. ఈ కాస్ట్లీ ఏరియాలో ఇల్లు కొనాలి అనేది ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల జీవిత ఆశయం అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బాలీవుడ్ లోని బడా స్టార్స్ తో పాటు పలువురు క్రికెటర్లు కూడా అక్కడే నివసిస్తున్నారు. మరి ఇంతకీ బాంద్రాలో నివసిస్తున్న ఆ సెలబ్రిటీస్ ఎవరు అనే విషయంపై ఓ లుకేద్దాం.

1. షారుక్ ఖాన్ – మన్నత్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇల్లు బాంద్రాలోనే ఉంది. కింగ్ ఖాన్ హౌజ్ కళ్ళు చెదిరేలా అద్భుతమైన రాజ భవనంలా ఉంటుంది. ఎంతో మంది షారుక్ అభిమానులు ఆయన ఇంటి ముందు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఇక షారుక్ బర్త్ డే నాడు ఆయన అభిమానులకు తన ఇంటి బాల్కనీ నుంచే అభివాదం చేస్తారు షారుక్. ఆయన చేసే ఆ చిన్న సైగ కోసం ఎంతో దూరం నుంచి వచ్చి పడిగాపులు పడుతూ ఉంటారు బాద్షా ఫ్యాన్స్.

2. రేఖ

బాంద్రాలో ఇల్లు ఉన్న మరో పాపులర్ స్టార్ హీరోయిన్ రేఖ. ఆమె ఇంటిపేరు సీ స్ప్రింగ్స్.

- Advertisement -

3. సల్మాన్ ఖాన్ – గెలాక్సీ అపార్ట్మెంట్

ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ బాంద్రా లోనే నివసిస్తున్నారు. ఆయన అక్కడ గెలాక్సీ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

4 రణబీర్ కపూర్ – అలియా భట్

ఈ సెలబ్రిటీ కపుల్ కూడా బాంద్రాలోనే నివసిస్తోంది. వాస్తు అనే అపార్ట్మెంట్ భవనంలోని ఓ ఫ్లాట్ లో ఈ దంపతులు తమ కూతురితో కలిసి ఉంటున్నారు.

5. సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్

రాజ కుటుంబానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ కు కూడా బాంద్రాలాంటి లగ్జరీ ఏరియాలో ఓ ఫ్లాట్ ఉంది. ఫార్చ్యూన్ హైట్స్ అనే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దంపతులు తమ పిల్లలు తైమూర్, జెహ్ లతో కలిసి ఉంటున్నారు.

6. అమీర్ ఖాన్

ఇక బాలీవుడ్ ఖాన్ల త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ కూడా బాంద్రా లోనే ఉంటున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ బెల్లా విస్టా అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్నారు.

7. సచిన్ టెండూల్కర్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా బాంద్రాలోని తన కుటుంబంతో కలిసి ఒక అతి పెద్ద విల్లాలో నివసిస్తున్నారు. ఆయన ఇంటిపేరు డోరబ్ విల్లా.

ఇలా సముద్రం ఒడ్డున ఉన్న బాంద్రా సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్ గా మారి, విపరీతంగా పాపులర్ అయింది. వీళ్లంతా తమ ఇళ్ల నుంచి చూస్తే అద్భుతమైన వ్యూ కన్పించేలా ప్లాన్ చేసి మరీ అక్కడ ఇల్లు కొన్నారు. ఇక ఇప్పుడు అక్కడే పూజా హెగ్డే కూడా మకాం పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు