Tollywood: త్రివిక్రమ్ కంటే ముందే పూజా హెగ్డేను అంతలా ట్రై చేసిన టాలీవుడ్ డైరెక్టర్..!

అక్కినేని నాగచైతన్య కథానాయకుడుగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూజా హెగ్డే. ఆ తరువాత వరుణ్ తేజ్ సరసన ముకుందా సినిమాలో నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. వీటిలో కొద్దిలో కొద్దిగా ఒక లైలా కోసం కాస్త బెటర్ అని చెప్పవచ్చు. అయితే టాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు చేసిందో లేదో ఏకంగా బాలీవుడ్ కి చెక్కేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన మొహంజదారోలో నటించింది.

కానీ అక్కడ కూడా మొదటి సినిమానే ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి నిరాశ తప్పలేదు. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయ్యి ఉంటే ఆమె టాలీవుడ్ వైపు కన్నెత్తి చూసేది కాదు. కానీ ఫ్లాప్ కావడంతో ఈమెని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఐరన్ లెగ్ అని ముద్రపడిన హీరోయిన్లను గోల్డెన్ లెగ్ గా మార్చడం దర్శకుడు హరీష్ శంకర్ కే చెందింది. గతంలో శృతిహాసన్ పై కూడా ఐరన్ లెగ్ అనే ముద్రపడిన సమయంలో ఆమెకి గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం ఇచ్చి గోల్డెన్ లెగ్ గా మార్చాడు హరీష్ శంకర్.

అచ్చం ఇలానే పూజా హెగ్డే కి కూడా దువ్వాడ జగన్నాథం అనే సినిమాతో తెలుగులో అవకాశం ఇచ్చాడు హరీష్. ఈ చిత్రంలో పూజాని బికినీలో చూపించి టాలీవుడ్ జనాలకి వెర్రెక్కించాడు. దీంతో ఆమెకి హిట్స్ లేకపోయినా అవకాశాలు ఇస్తూనే వచ్చారు ఇతర దర్శకులు. కానీ అవకాశాలు ఇచ్చిన టాలీవుడ్ జనాలను, మేకర్స్ ని వల్గర్ గా కామెంట్ చేసింది పూజ. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ రవితేజతో తెరకెక్కించబోతున్న సినిమాలో పూజాని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. కానీ ఇప్పుడు మళ్లీ హరీష్ శంకర్ పూజా కి ఛాన్స్ ఇస్తే తిట్టని వాళ్ళు ఉండరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు