Love Life Tips :ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవుతున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అది నిజమే. ఎవరైనా ఫస్ట్ టైం మనల్ని చూసినప్పుడు వాళ్లతో మనం నడుచుకునే విధానాన్ని బట్టి ఫ్యూచర్ రిలేషన్షిప్ డిసైడ్ అవుతుంది. అయితే మనం ఎవరినైనా మొదటిసారి కలిసే ముందు లేదా ఇంటర్వ్యూలు లాంటి వాటికి వెళ్లే ముందు చాలా ప్లాన్స్ చేసుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ టైం కలుస్తున్నాం కాబట్టి మనల్ని చూసి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని కోరుకుంటాం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాము. నిజానికి ఆ తప్పు మనకు తెలియకుండానే టెన్షన్లో జరిగిపోతుంది. దానికి కారణం మన బాడీ లాంగ్వేజ్. ముఖ్యంగా ఏదైనా డేటింగ్ కు వెళ్ళినప్పుడు, లేదా గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ టైం కలవాలి అని అనుకుంటున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఫస్ట్ మీటే లాస్ట్ మీట్ అవుతుంది. మరి ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ ను కలిసేటప్పుడు చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఫోన్ ను చూడొద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ అనేది ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. చాలామంది ఎక్కువ సమయం ఫోన్ తోనే గడుపుతున్నారు. ఇక ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ ని వెంట తీసుకెళ్లడం మామూలే. అయితే తీసుకెళ్లడం తప్పు కాదు, కానీ వెళ్ళాక మీ దృష్టి అంతా ఆ ఫోన్ పైనే ఉండడం తప్పు. ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నారు అంటే అది అతి పెద్ద మిస్టేక్ అవుతుంది. వాళ్లంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అని ఎదుటి వ్యక్తి అనుకునే అవకాశం ఉంది.

అతిగా మాట్లాడడం ప్రమాదకరం. నిజానికి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల అవతలి వ్యక్తి తన ఆలోచనలను మీ ముందు వ్యక్తం చేయలేరు. దీంతో పరిస్థితి అన్ కంఫర్టబుల్ గా మారే అవకాశం ఉంటుంది. మాట్లాడడం ఎక్కడ ఆపాలో తెలుసుకోండి. అవతల వారికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళేంటో మనకు అర్థమవుతుంది.

- Advertisement -

బాడీ లాంగ్వేజ్ వల్ల అవతలి వ్యక్తికి మీ వ్యక్తిత్వం, స్వభావం గురించి ఈజీగా అర్థమవుతుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం. కళ్ళ ద్వారానే అవతలి వ్యక్తిపై మీకున్న నమ్మకం, ఇష్టం అనేవి తెలుస్తాయి. కాబట్టి ఐ కాంటాక్ట్ మైంటైన్ చేయండి.

అనవసరంగా నవ్వడం అపార్థాలకు దారి తీసే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముఖంపై చిరునవ్వు ఉండడం అనేది చాలా ముఖ్యం. కానీ కారణం లేకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నారంటే ఎదుటి వ్యక్తికి మీరు చులకనగా అనిపిస్తారు. అంతేకాకుండా అవతలి వ్యక్తి మాటలు మీకు అస్సలు నచ్చడం లేదు అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు అనవసరంగా నవ్వడాన్ని మానుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు