Personality Development Tips :ఈ 5 అలవాట్లు ఉన్నాయా? జనాలు మీ నుంచి పారిపోవడం ఖాయం

కొంతమంది వ్యక్తులు స్నేహపూర్వకంగా ఉంటూ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎలాంటి పార్టీ జరిగిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. అలాంటి వారిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అలాగే వారితో మాట్లాడాలని తహతహలాడుతుంటారు. కానీ కొంతమందిని మాత్రం దూరం పెడుతూ ఉంటారు. వాళ్లు మాట్లాడడానికి ఇష్టపడినా, జనాలు మాత్రం వారి నుంచి దూరంగా పారిపోవాలని చూస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురవుతోందా?

మీతో మాట్లాడడానికి ఇష్టపడకుండా, ఎవరైనా మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని అనిపిస్తే దానికి కారణం మీరే. మీ వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి. అప్పుడు మీరు కూడా అందరితోనూ ఈజీగా కలవచ్చు. అలాగే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగాలంటే మీలో ఉన్న కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. అలాగే మీ బిహేవియర్ ను చేంజ్ చేసుకోవాలి. ఈ టిప్స్ తో మిమ్మల్ని మీరు మార్చుకోండి.

నెగిటివ్ గా మాట్లాడడం మానేయండి. ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడే వారిని చాలా మంది దూరం పెడతారు. అలాగే ఇతరులపై చాడీలు చెప్పడం లాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేసే వారు చుట్టు పక్కల ఉండాలని ఎవరూ కోరుకోరు కదా. ఒకవేళ మీకు ఇలాంటి అలవాటు గనుక ఉంటే వెంటనే మార్చుకోవడం మంచిది.

- Advertisement -

గొప్పలు చెప్పడం మానేయండి. అవతలి వ్యక్తిని చిన్నచూపు చూస్తూ, వాళ్లకంటే మీరు గొప్ప వాళ్ళని భావిస్తూ ఉంటే వెంటనే అలా చేయడం మానేయండి. లేదంటే మీరు అహంకారి అనే ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఒకసారి ఆ ఇమేజ్ వచ్చింది అంటే జనాలు మీతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడరు.

ఎప్పుడూ మీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దకండి. ఎదుటి వ్యక్తి మీ అభిప్రాయాన్ని అంగీకరించాలని, ఏకీభవించాలని ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఒకవేళ అలా చేశారంటే గనక మీరు కావాలనుకున్నా ఆ వ్యక్తులు నుంచి దూరంగా వెళ్లిపోతారు. కాబట్టి వీలైనంత త్వరగా మీలో ఉన్న ఈ చెడు అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించండి.

తప్పును ఒప్పుకోవడం స్టార్ట్ చేయండి. అవతలి వ్యక్తి గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తే అది మీ వ్యక్తిత్వాన్ని ఖరాబ్ చేస్తుంది. అంతేకాకుండా తప్పు చేసిన తర్వాత కూడా ఆ తప్పును మీరు అంగీకరించకపోతే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. అలాంటి వ్యక్తులతో ఎవరూ సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్ ను కూడా త్వరగా మార్చుకోండి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు