Kajol: కాజోల్ – రాణీ ముఖర్జీ మధ్య విభేదాలు.. సీక్రెట్ బయటపెట్టిన కరణ్ జోహార్..!

బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న టాక్ షోలలో కాఫీ విత్ కరణ్ షో కూడా ఒకటి. ఏడు సీజన్లను పూర్తిచేసుకుని తాజాగా ఎనిమిదవ సీజన్ కూడా మొదలయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లు అయిన కాజోల్ , రాణీ ముఖర్జీ వచ్చి సందడి చేశారు. అంతేకాదు ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ వీరిద్దరితో ముచ్చటించడమే కాదు ఎన్నో రహస్యాలను బయట పెట్టించారు. వాస్తవానికి వీరు ముగ్గురి పరిచయం ఇప్పటిది కాదని చెప్పాలి.

డైరెక్టర్గా కరణ్, హీరోయిన్లుగా కాజోల్, రాణి ముఖర్జీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచే వీరి మధ్య మంచి స్నేహం ఉంది. వాస్తవానికి అక్కచెల్లెళ్లయిన కాజోల్ , రాణి ముఖర్జీ అంతగా ఎందుకో కలవలేకపోయారు. అలా కలవక పోవడానికి కారణం ఏమిటి అనేది ఈ కాఫీ విత్ కరణ్ షో లో బయటపెట్టారు. రాణి ముఖర్జీ కాజోల్ ఇద్దరు అక్కచెల్లెళ్ళు అవుతారు. కానీ వీరి మధ్యలో స్నేహం మాత్రం అంతగా ఉండేది కాదు.. కుచ్ కుచ్ హోతా హై సినిమాలో వీరిద్దరూ కలిసి నటించినా కూడా స్నేహితులు అవ్వలేకపోయారు. ఇక ఇదే విషయాన్ని కరణ్ జోహార్ గుర్తు చేస్తూ.. ఇప్పుడు చాలా క్లోజ్ గా ఉన్నారు అయితే ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఏమయింది అని అడిగారు.

ఇకపోతే అది నిజమేనని తెలిపిన కాజోల్ సహజంగా ఏర్పడిన దూరమే అని.. వృత్తిపరంగా ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళము అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే రాణి ముఖర్జీ మాట్లాడుతూ .. కాజోల్ అక్కగానే తెలుసు.. పెరుగుతున్న కొద్ది మనుషుల మధ్య కూడా దూరం పెరుగుతుంది.. అందుకే మేము ఎక్కువగా కలిసే వాళ్ళం కాదు.. కాజోల్ అక్క టౌన్ లో ఉండేది. మేము జూహులో ఉండే వాళ్ళము. అయితే అక్క మాత్రం ఫ్యామిలీలో అబ్బాయిలతో ఎక్కువ క్లోజ్ గా ఉండేది అంటూ రాణి ముఖర్జీ తెలిపింది.

- Advertisement -

కాజోల్ తండ్రి, రాణి ముఖర్జీ తండ్రి ఇద్దరు చనిపోయిన తర్వాత ఆటోమేటిగ్గా క్లోజ్ అయ్యారట. ఇక ఇదే విషయాన్ని రాణీ ముఖర్జీ బయటపెట్టింది.ఇకపోతే అది నాచురల్ గా జరిగిపోయిందని.. కాజోల్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. మొత్తానికి అయితే వీరిద్దరి మధ్య ఉన్న రహస్యాలను కూడా బయటపెట్టారు కరణ్ జోహార్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు