ఇక లావణ్య కుటుంబ సభ్యులు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయిస్. కానీ లావణ్యకి చిన్ననాటి నుండి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఆ వైపుగా అడుగులు వేసింది. సాధారణ కుటుంబం నుండి వచ్చిన లావణ్య ఇప్పుడు మెగా ఇంటి కోడలు అయ్యింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఓ విషయంలో సమంత బాటలోని పయనిస్తుందట లావణ్య త్రిపాఠి.
ఏ విషయంలో అంటే.. పెళ్లయిన నెల రోజులకే లావణ్య తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పేరును మార్చేసింది. ఇన్ని రోజులు లావణ్య త్రిపాఠిగా ఉన్న పేరును ఇప్పుడు లావణ్య త్రిపాఠి కొణిదెల అని మార్చేసింది. దీంతో గతంలో సమంత కూడా వివాహమైన తర్వాత తన ఇంస్టాగ్రామ్ లో పేరును ఇలానే మార్చేసిందని.. కానీ కొంతకాలానికే విడాకులు తీసుకుందని.. అలా మీరు కూడా విడాకులు తీసుకోకూడదు అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.