Dilraju: దిల్ రాజు ఇంట్లో పెళ్లి భాజాలు.. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కుర్ర హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా సెలబ్రిటీలు సైతం వివాహాలు చేసుకుంటూ ఉన్నారు.. గడిచిన నెల రోజుల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత వెంకటేష్ రెండవ కుమార్తె ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో యంగ్ హీరో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బడా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి.

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలో బాగా కొనసాగుతూ ఉన్నారు. దిల్ రాజ్ కు కుమారుడు లేకపోవడంతో తన వారసుడుగా శిరీష్ కొడుకు ఆశీష్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. గతంలో ఈ హీరో రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత సెల్ఫిష్ అనే మరొక సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఆ తర్వాత మరొక సినిమాను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందట .ఈ మూడు సినిమాలు ఇంకా పూర్తి చేయకుండానే ఈ కుర్ర హీరో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

ఆశిష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యాపారవేత్త కూతురు ఆదిత్వా రెడ్డితో ఈ హీరో నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ పూర్తి అయిన తర్వాత పలు రకాల వీడియోలను, ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీంతో పలువురు నెటిజెన్స్ ప్రముఖులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

 

డిస్ట్రిబ్యూటర్ గా మొదట తన కెరీర్ ని ప్రారంభించిన దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా మారి టాలీవుడ్ లో తను తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా మంచి విజయం అవ్వడం చేత అగ్ర నిర్మాతగా కూడా పేరు సంపాదించారు.. ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుసగా పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.. కొన్ని కోట్ల రూపాయలకు అధిపతిగా మారిన దిల్ రాజ్ స్టార్ ప్రొడ్యూసర్ గా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారని చెప్పవచ్చు. ఆశిష్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు