Amala Paul: షూటింగ్ ప్లేస్ లోనే అమలాపాల్ ని కొట్టిన స్టార్ డైరెక్టర్..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2009లో మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. వరుస సినిమాలలో నటించి అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోయింది. ఇక 2011లో వచ్చిన బెజవాడ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటించి తనదైన అందం, నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, పిట్ట కథలు వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.

కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక కోలీవుడ్ లో మంచి హిట్లను అందుకున్న అమల.. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్ని విభేదాల వల్ల రెండేళ్లు కూడా నిండకుండానే వీరు విడాకులు తీసుకున్నారు. ఇక తాజాగా తన ప్రియుడు జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అమలాపాల్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

ఈమె చదువుకున్న రోజుల్లోనే ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా సెటిల్ అవుదాం అనుకుందట. అలా మొదట మలయాళంలోనే నీల తామర అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత రెండు బి గ్రేడ్ మూవీస్ లో కూడా నటించిందట. అయితే అమలాపాల్ కెరియర్ ని మలుపు తిప్పిన మూవీ గా మైనా సినిమాని చెప్పుకోవచ్చు. అయితే మైనా సినిమా దర్శకుడు ప్రభు సోలమాన్ ఈ సినిమా కోసం కొత్త హీరో, కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న అమలాపాల్ ఆ దర్శకుడి దగ్గరికి వెళ్లి తాను ఇప్పుడే చదువు పూర్తి చేసి ఇండస్ట్రీలోకి వచ్చానని.. ఇంతవరకు ఏ సినిమాలో నటించలేదని అబద్ధం చెప్పిందట. ఈ విషయం నమ్మిన ఆ దర్శకుడు మైనా సినిమాని దాదాపు 90% తెరకెక్కించారట. అదే సమయంలో అమలాపాల్ నటించిన రెండు సినిమాలు విడుదల కావడంతో ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు ప్రభు సోలమాన్ కోపంగా షూటింగ్ సెట్ కి వెళ్లి నాతోనే అబద్ధం చెబుతావా..? అని షూటింగ్ ప్లేస్ లోనే కొట్టారట. ఆ తరువాత 10% మూవీ ని ఎలాగోలా తెరకెక్కించి.. అమలాపాల్ ని మూవీ ప్రమోషన్స్ కి కూడా రానివ్వకుండా దర్శకుడు అడ్డుకున్నారట. ఇక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలైన మైనా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో అమలాపాల్ మీద ఉన్న నెగెటివిటీ చెరిగిపోయి ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు