Amala Paul: 2023లో కూడా వివక్షత ఎందుకు?

మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమఖైదీ సినిమా నుండి తెలుగు, తమిళ భాషల్లో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అమలాపాల్. ఈ ముద్దుగుమ్మ కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. కానీ కోలీవుడ్ లో బాగా పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. అమలాపాల్ అసలు పేరు అనఖ. తన విద్యాభ్యాసాన్ని కొచ్చిలో పూర్తి చేసింది.

ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోనస్ తెరకెక్కించిన నీల తామర సినిమాతో సినీ తెరకు పరిచయమైంది. ఇక దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని రెండేళ్ల తర్వాత విడాకులు కూడా తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అమలాపాల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది.

కేరళలోని ఎర్నాకులంలోని తిరువైరాణికుళం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించడానికి అధికారులు తనకు అనుమతి నిరాకరించారని నటి అమలాపాల్ ఆరోపించారు. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాల కారణంగా దర్శనం నిరాకరించారని ఆమె వాపోయింది. అంతేకాకుండా బయట నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవాలని బలవంతం చేశారని చెప్పింది.
ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో అమలాపాల్ తన అనుభవాన్ని పంచుకుంది.

- Advertisement -

” 2023 లో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ విషయం నన్ను నిరాశపరిచింది. నేను దేవత దగ్గరికి వెళ్ళలేకపోయాను. కానీ దూరం నుండి అమ్మవారిని మొక్కుకున్నాను. త్వరలోనే మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. మత ప్రాతిపాదికను కాకుండా అందరినీ సమానంగా చూసే రోజు త్వరలోనే రావాలి ” అని పేర్కొంది అమలాపాల్. అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు తాము ప్రోటోకాల్ ను మాత్రమే పాటిస్తున్నామని తెలిపారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు