Rashmika Mandanna: రౌడీ ఇంట్లో అడ్డంగా దొరికిపోయిన రష్మిక..త్వరలోనే గుడ్ న్యూస్..!

ఉప్పు లేనిదే పొగ రాదంటారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌ల గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ చూస్తే కూడా ఈ సామెత నిజమే అనిపిస్తుంది. వీరిద్దరూ కలిసి మొదట గీతాగోవిందం సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తరవాత కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా జోడీ కట్టారు. ఈ సినిమా ఆశించిన రేంజ్ లో విజయం సాధించలేదు కానీ పెయిర్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే రెండు సినిమాలు చేస్తున్న క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ వార్తలు మొదలయ్యాయి.

దానికి కారణం లేకపోలేదు. విజయ్ దేవరకొండ చాలా మంది హీరోయిన్ లతో సినిమాల్లో నటించాడు. కానీ ఎవ్వరితోనూ పార్టీలకు వెకేషన్ లకు వెళ్లలేదు. కానీ రష్మికతో మాత్రం పార్టీలు వెకేషన్లు అన్నీ కవర్ చేశాడు. అంతే కాకుండా రష్మిక ఏకంగా విజయ్ దేవరకొండ ఇంట్లో పండుగలకు కూడా వెళ్లడంతో వీరిద్దరి రిలేషన్ షిప్ వార్తలు గుప్పుమన్నాయి.

గతంలో రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో సందడి చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తరవాత వీరిద్దరూ గోవాలో న్యూయర్ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దాంతో వీరిద్దరూ లవ్ ఉన్నారని నెటిజన్లు, ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంతే కాదు విజయ్ దేవరకొండ ముంబైలో లైగర్ సినిమా షూటింగ్ బిజీగా లో ఉన్న సమయంలో రెస్టారెంట్ కు వెళ్లి కెమెరాలకు దొరికిపోయారు. మరోవైసే గతంలో వీరిద్దరూ మాల్దీవులకు కూడా కలిసి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇలా ఫోటోలు వైరల్ అయ్యిన ప్రతిసారీ వీరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం తాము రిలేషన్ షిప్ లో లేమని చెబుతున్నారు.

- Advertisement -

కాగా తాజాగా మరోసారి రష్మిక విజయ్ ఇంటికి వెళ్లి అడ్డంగా దొరికిపోయింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఎంజయ్ చేసిన ఫోటోలు నెట్టింట షేర్ చేశాడు. కాగా రష్మిక కూడా దివాళి సెలబ్రేషన్స్ వీడియోను షేర్ చేసింది. అయితే రెండు వీడియోల్లో కూడా బ్యాగ్రౌండ్ ఒకటే ఉండటంతో మరోసారి దొరికిపోయారు. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కావాలనే ఈ జంట లీకులు ఇస్తోందని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ రష్మికలు తమ రిలేషన్‌షిప్ వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు