Tollywood: 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అనేది ట్రెండింగ్ గా మారింది. పలువురు స్టార్ హీరోలు 1000 కోట్ల క్లబ్ లో తమ పేరును చేర్చుకోవడానికి గట్టిగానే శ్రమిస్తున్నారు. బాహుబలి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ లో భాగం కావడానికి పలువురు స్టార్ హీరోలు తహతలాడుతున్నారు. షారుక్, పఠాన్ జవాన్ సినిమాలు దాదాపుగా 1000 కోట్లు రాబట్టాయి. ఇక హీరోల విషయం పక్కన పెడితే మొదటిసారి 1000 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా రికార్డును క్రియేట్ చేసింది తెలుగు హీరోయిన్ అన్న విషయం మీకు తెలుసా? తను మరెవరో కాదు అనుష్క శెట్టి. దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కాని రికార్డును అనుష్క క్రియేట్ చేసి చూపించింది.

2017 లో రిలీజ్ అయి సంచలనం సృష్టించిన బాహుబలి 2 మూవీతో అనుష్క ఈ అరుదైన ఫీట్ సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు భాగాల్లోనూ అనుష్క అదరగొట్టింది. అప్పట్లోనే ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ఇందులో హీరోయిన్ గా నటించిన అనుష్క 1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరిన మొట్టమొదటి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత అనుష్క చేసిన రెండు మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. దీంతో చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా, ఆ సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయనుంది అని ప్రచారం జరుగుతోంది.

వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ అనుష్క బరువు పెరగడం వంటి పలు కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. రీసెంట్ గా ఆమె క్రిష్ దర్శకత్వంలో ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ చేయడానికి అంగీకరించింది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ షూటింగ్ కోసం హైదరాబాదులో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుష్క వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనుష్క, క్రిష్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీకి “శీలవతి” అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి అనుష్క గతంలో లాగా వరుసగా సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కానీ స్వీటీ మాత్రం స్లోగా మూవీస్ చేస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు