తెలుగు ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాలతో ఒక లెగసీనే క్రియేట్ చేశాడు. ఆనాడు టాప్ హీరోలు అంటే.. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ అంటూ స్టార్ట్ చేస్తారు. కృష్ణ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు ఈ లెగసీని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టైర్ 1 హీరోల్లో మహేష్ బాబు మొదటి వరసలో ఉంటాడు. అది ఘట్టమనేని ఫ్యామిలీ రేంజ్. అయితే ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యామిలీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే , సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
అదే నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం. వీళ్లిద్దరి రిలేషన్ షిప్ వల్ల సూపర్ స్టార్ ఫ్యాన్స్ బహిరంగంగానే తిరగడమే పెద్ద సమస్యగా మారింది. ఒక సెలబ్రెటీ రెండో పెళ్లి చేసుకుంటేనే విపరీతమైన ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ఘట్టమనేని వారసుడు ఏకంగా నాలుగో పెళ్లికి సిద్ధమవడం, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. అంతే కాదు.. వీరి జీవిత కథ ఆధారంగా మళ్లీ పెళ్లి అనే సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల థియేటర్స్ లోకి వచ్చి డిజాస్టర్ గా మారింది. అయినా ఈ సినిమా ప్రమోషన్లు చేయడం మాత్రం మానలేదు నరేష్, అలాగే ప్రమోషన్ల పేరుతో పవిత్రతో రొమాన్స్ చేయడం కూడా మానలేదు.
Read More: Tollywood: ముసలోడితో సినిమానా..? చిరంజీవిని అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..!
ఇదిలా ఉండగా ఇటీవల మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మళ్లీ పెళ్లి సక్సెస్ ను తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు అంకితం ఇస్తామని నరేష్ ప్రకటించాడు. కృష్ణ 81వ జయంతి ఈ నెల 31న జరగబోతున్న సంగతి తెలిసిందే. ఆ రోజున తన మళ్లీ పెళ్లి సినిమాను కృష్ణకు అంకితం ఇస్తామని వెల్లడించారు. అయితే నరేష్, పవిత్ర లోకేష్ తో వ్యవహారం, మళ్లీ పెళ్లి చిత్రం ఇలా అన్ని విషయాల్లో సైలెంట్ గా ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. చేసేదే.. చెడు పని, అందులో తమ అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ ను ఎందుకు తీసుకోస్తున్నారు అంటూ నరేష్ ను ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఇంకొంత మంది అయితే నరేష్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. మరీ ఫ్యాన్స్ ను వ్యతిరేకించి మళ్లీ పెళ్లిని కృష్ణకు అంకితం ఇస్తాడా ? లేదా వెనక్కితగ్గుతాడా ? అనేది చూడాలి మరి.
For More Updates :
Read More: #NationalFilmAwards2023: నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలుగు సినిమా..!
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...