Krishna : ముగిసిన ఓ తరం సినీ ప్రస్థానం

ఒక తరం సినీ ప్రస్థానం ముగిసింది. తెలుగు సినీ వినీలాకాశంలో మరో దృవతార చేరింది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంతో ఒక తరం నటులందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు అయింది. 70, 80 దశాబ్దాల్లో తెలుగు సినీ పరిశ్రమలు ఏలిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, లాంటి నటులు ఇప్పుడు మన ముందు లేరు. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఆ జనరేషన్ కి చెందిన మరో సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్నుమూయడంతో సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున 4:09 గంటలకి మృతి చెందారని కాంటినెంటల్ ఆసుపత్రి ప్రకటించింది.గుండెపోటుకి గురైన కృష్ణను ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పటి నుంచి ప్రతి గంటకు కుటుంబ సభ్యులతో చర్చిస్తూ వైద్యం అందించినట్లు వెల్లడించారు ఆసుపత్రి వైద్యులు. కిడ్నీలు, గుండె, మెదడు డామేజ్ సహా శరీరంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లు తెలిపారు.

ఆరోగ్యం విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది. ఈ సంవత్సరంలోనే అయిన వాళ్లను కోల్పోయాడు. తండ్రి, తల్లి, సోదరుడు కన్నుమూయడంతో మహేష్ బాబు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరిలో సోదరుడు రమేష్ బాబు, సెప్టెంబర్ లో తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు తండ్రి కృష్ణ కన్నుమూయడంతో మహేష్ బాబు కి ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు