Pushpa 2: కేజీఎఫ్ స్ట్రాటజీ వాడుతున్న సుకుమార్

Pushpa 2

రెండు రోజుల క్రితం “పుష్ప”కు మూడవ భాగం కూడా రాబోతుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ అదే గనక నిజమైతే యష్ బ్లాక్ బస్టర్ మూవీ “కేజిఎఫ్” స్ట్రాటజీని లెక్కల మాస్టర్ ఫాలో అవుతున్నట్టే. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి అంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న “పుష్ప 2” షూటింగ్ దశలో ఉంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సీక్వెల్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సెకండ్ పార్ట్ కనక హిట్ అయితే మూడవ భాగాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉందట “పుష్ప” యూనిట్. రీసెంట్ గా సుకుమార్ తన ఈ ఆలోచనను అల్లు అర్జున్ ముందు ఉంచగా, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

“పుష్ప : ది రైజ్”లో పుష్ప రాజ్ ఎలా ఎదిగాడు అనే విషయాన్ని చూపించిన డైరెక్టర్ సుక్కు, సెకండ్ పార్ట్ “పుష్ప : ది రూల్”లో పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నాడు? అనే అంశాన్ని చూపించబోతున్నారు. ఇక మూడవ భాగం “పుష్ప : ది రూల్”లో పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే విషయాన్ని చూపించబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ బస్టర్ మూవీ కేజిఎఫ్, పుష్పకు మధ్య ఉన్న కొన్ని పోలికల గురించి చర్చ నడుస్తోంది.

- Advertisement -

కేజిఎఫ్, పుష్ప సినిమాలు రెండు భిన్న ప్రపంచాలు అయినప్పటికీ, రాకీ భాయ్ బాటలోనే పుష్ప నడుస్తున్నాడు అనిపిస్తోంది. కేజిఎఫ్ పార్ట్-1 లాగా పుష్ప పార్ట్ 1 కూడా అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కేజిఎఫ్ 2 వచ్చి దుమ్ము రేపిన విషయం తెలిసిందే. పుష్ప 2 ప్రస్తుతం అదే ప్లాన్ లో ఉంది. అయితే రెండవ భాగంతోనే కేజిఎఫ్ కథ ముగియలేదు. కేజీఎఫ్ పార్ట్ 3 ఉండబోతుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఈ సీక్వెల్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు లేవు.

కానీ ఖచ్చితంగా మేకర్స్ కేజీఎఫ్ పార్ట్ 3కి అయితే ప్లాన్ చేశారు. అలాగే పుష్పకు కూడా రెండవ భాగం ముగింపు కాదు. అలాగని “పుష్ప 2” పూర్తయిన వెంటనే పార్ట్ 3 సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో లేరు చిత్ర బృందం. కేజిఎఫ్ 3 రావడానికి సమయం పడుతున్నట్టుగానే, పుష్ప పార్ట్ 3 రావడానికి కూడా చాలా టైం పడుతుంది. కేజీఎఫ్ పార్ట్ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే యష్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసి, ఆపై సీక్వెల్ పై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారు.

అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప పార్ట్ 3 గురించి ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు పాన్ ఇండియా సినిమాలు ఉండడంతో “పుష్ప పార్ట్ 3 పట్టాలెక్కడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అవన్నీ పూర్తయ్యాకే అల్లు అర్జున్ పుష్ప మూడవ భాగంపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇలా మొత్తానికి సీక్వెల్స్ విషయంలో పుష్ప రాజ్, రాఖీ భాయ్ ని ఫాలో అవుతున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు