Allu Arjun – Allu Sirish: అల్లు అన్నదమ్ములకు పడటం లేదా – క్లారిటీ ఇదే

Allu Arjun – Allu Sirish

సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న విషయం ఎలా వైరల్ అవుతుందో మన అందరికీ తెలుసు. గోరంత విషయాన్ని కొండంత చేసి సెలబ్రెటీలను ఓ ఆట ఆడేసుకుంటారు కొంత మంది గాసిప్ రాయుళ్లు. దాని వల్ల సెలబ్రెటీల ఫ్యామిలీలు ఎలా ఇబ్బంది పడుతాయి. దాని వల్ల కలిగే నష్టాలేంటి అనే విషయాలు వారికి అనవసరం. గాసిప్స్ గురించి సెలబ్రెటీలు ఎంత స్ట్రాంగ్ స్పందించినా అవి తగ్గవు.

రీసెంట్‌గా కొన్ని రోజుల క్రితం అల్లు ఫ్యామిలీలో విభేదాలు అంటూ ఓ వార్త తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలోనే కాదు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంటూ దీనికి ఇంకా ఏమేమో జోడించి వార్తలను వండి జనాలపైకి వదిలారు. అలాగే అల్లు శిరిష్ కు స్క్రిప్ట్ సెలక్షన్ చేయడం రాదని, ఇంట్లో ఉన్న అల్లు అరవింద్, అల్లు అర్జున్ నుంచి సలహాలు తీసుకోడని, అందుకే ఆయన కెరీర్ ఇలా ఉంది అంటూ తెగ వార్తలు వచ్చాయి.

వీటి అన్నింటికీ చెక్ పెట్టడానికి అల్లు శిరిష్‌తో సినిమాలు చేసే ధీరజ్ మొగిలినేని స్పందించాడు. అల్లు ఫ్యామిలీలో విభేదాలు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం క్లిక్స్, లైక్స్ కోసం వచ్చే ఫేక్ న్యూస్ అంటూ ఘాటుగా స్పందించాడు. అల్లు ఫ్యామిలీలో ఉండే హీరోలు అందరూ ఒకటే అని, వారి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారని, కలిసే భోజనం చేస్తారని, కలిసే టూర్స్ వెళ్తారంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అలాగే శిరిష్ కెరీర్ విషయానికి వస్తే… స్క్రిప్ట్ లో ఎప్పుడు అల్లు అరవింద్ గానీ, అల్లు అర్జున్ కానీ, ఎంట్రీ ఇవ్వరని, అరవింద్ కొన్ని సార్లు సలహాలు మాత్రమే ఇస్తారంటూ చెప్పాడు. ఎలాంటి కథ అయినా, స్క్రిప్ట్ అయినా ఫైనల్ చేసేది శిరిష్ మాత్రమే అని వివరించాడు.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు