Lal Salaam Telugu Trailer: అప్పుడు సాయి కుమారే హిట్… మరి ఎప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు

Lal Salaam Telugu Trailer

బుధవారం సాయంత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్న లాల్ సలాం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అదే సమయంలో తెలుగు వర్షన్ ట్రైలర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ట్రైలర్ చూస్తే సినిమా ఆసక్తి పెరుగుతుంది. అతి సున్నితమైన అంశాన్ని డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ ఎలా డీల్ చేసింది? అనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అంతా బాగానే ఉన్నా… రజినీకాంత్ వాయిస్ పంటి కింద రాయిలా అనిపించింది.

రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లోని మూడో సినిమా అంతులేని కథ (1976). ఇది తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. దీని తర్వాత రజినీకాంత్ తెలుగులో చాలా సినిమాలు చేశాడు. అలాగే తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేశాడు. అలాగే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయినవి బాషా, పెద రాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో రజినీకాంత్ నుంచి వచ్చే డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్.

భాషా సినిమాలో “నేను ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్టు” అంటూ వచ్చే డైలాగ్ ఇప్పటికీ కూడా వాడుతున్న సంగతి తెలిసిందే. ఇక పెద రాయుడు సినిమాలో కూడా చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఇవే కాదు… 30 ఏళ్ల క్రితం రజినీకాంత్ నుంచి వచ్చే ప్రతి సినిమాలో వచ్చే డైలాగ్స్ చాలా వరకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.

- Advertisement -

కానీ, తర్వాత రోజులు గడుస్తున్న కొద్ది సాయి కుమార్ స్థానంలోకి ప్రముఖ సింగర్ మను వచ్చాడు. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ చేసే ప్రతి సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పింది మనునే. ఇప్పుడు మను డైలాగ్స్ చెబితే వాయిస్ నిజంగా రజినీకాంత్ దే అనుకుంటారు.

కానీ, ఇప్పుడు లాల్ సలాం సినిమాలో రజినీ డైలాగ్స్ చెబితే మను వాయిస్‌కి బదులు సాయి కుమార్ వాయిస్ వినిపించింది. సడన్‌గా సాయి కుమార్ వాయిస్ రావడంతో సినిమాలో రజినీకాంత్ కనిపించడం లేదు. సాయి కుమార్ సినిమే చూస్తున్నామనే ఫీల్ వస్తుంది. నిజానికి 30 ఏళ్ల క్రితం రజినీకాంత్ కు డబ్బింగ్ చెప్పింది సాయి కుమారే. అప్పడు ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా వరకు ఫేమస్ అయ్యాయి. కానీ, ఇప్పుడు అదే సాయి కుమార్ వాయిస్ ను యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు