Sreemukhi : లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి.. ఏకంగా పాన్ ఇండియా చిత్రంలో..?

Sreemukhi : తెలుగు లో స్టార్ యాంకర్ గా పేరుపొందిన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుందనడంలో సందేహం లేదు.. అందుకే ఆమె చేసే ప్రతి షో కూడా అంతే రేంజ్ లో సక్సెస్ అవుతూ ఒకవైపు బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరవుతూనే మరొకవైపు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. గతంలో శ్రీముఖి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. అయితే హీరోయిన్గా ట్రై చేసినా ఎందుకో సక్సెస్ కాలేక పోయింది శ్రీముఖి.. అయితే అల్లు అర్జున్ నటించిన జులాయి, రామ్ నటించిన నేను శైలజా , లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి బాగానే పేరు సంపాదించింది.

స్టార్ హీరో మూవీలో ఛాన్స్..

అయితే ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.. అదేమిటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రంలో శ్రీముఖి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్రలో శ్రీముఖి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.. గతంలో కూడా వీరిద్దరూ కలిసి జులాయి సినిమాలో అన్నా చెల్లెలుగా నటించారు..ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతోంది..

శ్రీముఖి కెరియర్..

శ్రీముఖి సినిమా కెరియర్ విషయానికి వస్తే.. చివరిగా చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో కనిపించింది.. ఇందులో ఖుషీ సినిమాలోని నడుము సీన్ రీ క్రియేట్ చేయాగా.. దారుణంగా ట్రోల్ కి గురైంది శ్రీముఖి.. బిగ్ బాస్ రన్నర్ గా కూడా నిలిచిన ఈమె స్టార్ యాంకర్ గా మాత్రమే కాకుండా చిరంజీవి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకొని చిరంజీవితో ప్రశంసలు కూడా అందుకుంది శ్రీముఖి.. ప్రస్తుతం పలు షోలకి యాంకర్ గా వ్యవహరిస్తోంది.

- Advertisement -

శ్రీముఖి వివాహం ..

శ్రీముఖి అభిమానులైతే ఈమె వివాహం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. అయితే పెళ్లి విషయం ఎత్తేసరికి శ్రీముఖి ఈ విషయాన్ని దాటేస్తూ ఇప్పుడు అప్పుడే చేసుకోను అన్నట్టుగా తెలియజేస్తోంది..కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గత కొన్ని నెలలుగా శ్రీముఖి ఒక యంగ్ హీరోతో లవ్ లో ఉందనే రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి.. గతంలో కూడా యాంకర్ ప్రదీప్ , శ్రీముఖి మధ్య ఏదో నడిచిందనే వార్తలు వినిపించాయి.

కానీ చివరికి ఈ విషయం పైన తాము మంచి స్నేహితులమంటూ క్లారిటీ ఇచ్చారు.. ఇక మొన్నటికి మొన్న ఒకరిని ప్రేమించిందని ఇంట్లో ఒప్పించి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.. ఇక అందులో కూడా నిజం లేకపోయింది. ఇక దీంతో ఈమె వివాహం చేసుకునే వరకు ఇలాంటి రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పలు చానల్స్ లో హోస్ట్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది శ్రీముఖి ( Sreemukhi ) మరి డైరెక్టర్ అట్లీ సినిమా శ్రీముఖి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు