Family Star : రిలీజ్ రోజే దెబ్బ… అంతా దానివల్లే..

Family Star : విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్ ఎట్టకేలకు ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించగా, దివ్యాంశ కౌశిక్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఇక దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు. ‘గీతా గోవిందం’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న రౌడీ హీరో మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు కొట్టలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఇక గతేడాది వచ్చిన ‘ఖుషి’ కూడా ఆశించినంత విజయాన్ని అందించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని గీతా గోవిందం తీసిన దర్శకుడితోనే మళ్ళీ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కొండన్న. ఇక విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో తెరకెక్కిన ”ఫ్యామిలీ స్టార్”, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందనని తెచ్చుకుంది. ఓపెన్ గా చెప్పాలంటే నెగిటివ్ రెస్పాన్స్ నే మూటగట్టుకుందని చెప్పొచ్చు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ రిజల్ట్ పై విజయ్ దేవరకొండ ఇంకా చిత్ర యూనిట్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు.

దిల్ రాజు భారీ ప్రమోషన్..

ఇక ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా కోసం చాలా గట్టిగా ప్రమోషన్స్ చేసాడు దిల్ రాజు. రిలీజ్ తర్వాత కూడా చేస్తూనే ఉంటాడని తెలుస్తుంది. నిజానికి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ పడిన తర్వాత, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరముంది. తన మార్కెట్, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాల్సి ఉంది. అందుకే అతని కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకమని చెప్పాలి. ఇది హిట్టయితే ఆ తర్వాత రాబోయే గౌతమ్ తిన్ననూరి సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను టార్గెట్ చెయ్యడానికి ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే ఈ అంచనాలన్నీ బెడిసికొట్టేలా ఉన్నాయి. మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ని మెప్పించే విధంగా కూడా లేదని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి కలెక్షన్లలో రిలీజ్ రోజే భారీ దెబ్బ పడిందని సమాచారం.

అంతా దీనివల్లే?

అయితే ఏప్రిల్ 5న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ కి నెగిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల థియేటర్లకు సగం దెబ్బేసారనుకుంటే, సాయంత్రం నుండి ఐపీఎల్ మ్యాచ్ తీవ్రంగా దెబ్బతీసింది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన రోజు నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నయ్ సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉండడంతో భారీగా అభిమానులు క్రికెట్ చూడడానికి వచ్చారు. స్టేడియం దగ్గర టికెట్టు కుక్క కూడా మిగల్లేదంటే ఫ్యాన్స్ ఆ మ్యాచ్ కోసం ఎంత వెయిట్ చేసారో తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా విచ్చేయగా, సినీ అగ్రనటులు విక్టరీ వెంకటేష్, అలాగే కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా మ్యాచ్ ని చూసేందుకు వచ్చారు. ఇంకేముంది తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ మొత్తం ఇంట్లో టివి పెట్టి మ్యాచ్ పై కళ్ళు పెట్టారు. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవడం తెలుగు రాష్ట్రాల అభిమానులని మరింత ఆనందంలో ముంచెత్తింది. అయితే దీనివల్ల ఫ్యామిలీ స్టార్ కి ఈవెనింగ్ , నైట్ షో ల కలెక్షన్లలో తీవ్రంగా దెబ్బపడిందని సమాచారం. ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో కనీసం 20 శాతం ఈ మ్యాచ్ వల్ల తక్కువ రావొచ్చని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు