Family Star : సినిమాని సినిమాటిక్ గానే తీయాలి – దిల్ రాజు

Family Star :విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రిలీజ్ కి ముందే భారీ అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో మళ్ళీ వస్తున్న సినిమా కావడం ఒక కారణమైతే, టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించడం మరో విశేషం. అన్నిటికి మించి దిల్ రాజు ఈ సినిమాని దగ్గరుండి నిర్మించాడు. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా ఆడియన్స్ ని మెప్పించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తుండగా, ఈ సినిమాపైనే అతను అన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారగా, గతేడాది వచ్చిన ‘ఖుషి’ కూడా ఆశించినంత విజయాన్ని అందించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కొండన్న. అయితే రిలీజ్ అయ్యాక మాత్రం వీళ్ళ ఆశలపై ప్రేక్షకులు దెబ్బేసారని చెప్పాలి. ప్రీమియర్స్ నుండే అంతంత మాత్రంగా టాక్ వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఆ టాక్ దాదాపుగా నెగిటివ్ అయిపొయింది.

ప్రెస్ మీట్ లో దిల్ రాజు కష్టం..

తాజాగా రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్(Family Star) క్రిటిక్స్ నుండి బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంటే, ఆడియన్స్ నుండి కొంతమంది డిజాస్టర్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం సక్సెస్ మీట్ అంటూ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేసాడు. ప్రెస్ మీట్ లో కూడా ‘ఫ్యామిలీ స్టార్’ రిజల్ట్ పై చిత్ర యూనిట్ మాత్రం చాలా ధీమాగా ఉన్నట్టు కనిపించినా, మీడియా నుండి కవర్ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. అందరికంటే దిల్ రాజు మీడియా తో ఈసారి మాట్లాడడానికి చాలా కష్టపడ్డాడని చెప్పాలి. సినిమాకి ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందని సక్సెస్ మీట్ లో పలు విలేఖర్లు మాట్లాడడం జరిగింది. దానికి దిల్ రాజు ఓపికతో సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చిందంటూ, వెయ్యి మందిలో వంద మందికి నచ్చాల్సిన పనిలేదు అంటూ సమాధానమిచ్చాడు. ఇంకొక విలేఖరి సినిమా సగం బయట తీశారు, అప్పుడు మిడిల్ క్లాస్ సినిమా ఎలా అవుతుంది అని అడిగాడు. దానికి దిల్ రాజు సమాధానమిస్తూ మొత్తం ఇక్కడే తిసినాం అనుకో ఇంట్లో, అప్పుడు టివి సీరియల్ తీశార్రా బాబు అంటారు. అందుకే ఇలా తీశామన్నాడు.

మరొకరు సినిమాలో మిడిల్ క్లాస్ హీరో అన్ని ఫైట్లు చేయడమేంటని అంటే ఒక బ్లాక్ బస్టర్ అయిన సినిమాలో ఒక స్టార్ హీరో ఎంత మందిని అయినా కొడతాడు. సినిమా ఎమోషన్ డ్రామాకి కనెక్ట్ అయితే మనకి లాజిక్స్ ఉండవు అన్నాడు. ఇదంతా కాక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ దేవరకొండని డామినేట్ చేసిందని ఆడియన్స్ అంటున్నారు అంటే, హీరోయిన్ ఎక్కడ డామినేట్ చేసింది, మొత్తం హీరోనే ఎక్కుతున్నాడుగా సెకండ్ హాఫ్ అంతా, ఎక్కడా అని అన్నాడు. ఏది ఏమైనా ఇది సినిమా కాబట్టి సినిమాటిక్ లాగానే తీయాలి అని ముగించాడు. ప్రెస్ మీట్ లో మాత్రం దిల్ రాజు పైకి నవ్వతూన్నా కాస్త అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తుంది. దిల్ రాజు హ్యాపీ అవ్వాలంటే మాత్రం కలెక్షన్లతోనే కుదురుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు