Sneha: ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ భార్య

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా తన పుట్టినరోజును పురస్కరించుకొని సినీ ఇండస్ట్రీలోని హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ హాజరయ్యారు. వెంకటేష్, అల్లు అరవింద్, నాగచైతన్య, రానా, కీరవాణి, దిల్ రాజు, శ్రీకాంత్, నవీన్ యెర్నేని, నాగార్జున, విజయ్ దేవరకొండ, అఖిల్ ఇలా ప్రముఖులంతా ఈ పార్టీకి హాజరై రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, తదితరులు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ రావడంతో ఈసారి పుట్టినరోజు చరణ్ కు మరింత ప్రత్యేకంగా మారిపోయింది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ వేడుకలకు అల్లు అర్జున్ మిస్ అయ్యారు. అంతేకాదు ఈయన కనీసం ట్వీట్ కానీ, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ కానీ పెట్టలేదు. దీంతో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు బన్నీ మిస్ అవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అల్లు అరవింద్ హాజరైనప్పటికీ అల్లు అర్జున్ హాజరు కాకపోవడమే అందరిలో సంశయాన్ని రేకెత్తించింది.

అయితే రామ్ చరణ్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పలేదని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సమయంలో తమ కుటుంబం అంతా వియత్నాం లో హాలిడే కి వెళ్ళామని క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ భార్య స్నేహ. పుష్ప 2 షెడ్యూల్ కు కాస్త గ్యాప్ దొరకడంతో తామంతా హాలిడే కి వెళ్ళామని.. ఓ హోటల్ లో ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇందులో అల్లు అర్జున్, స్నేహ, వారి పిల్లలు కూడా ఉన్నారు. విదేశీ యాత్రలో ఉండడం వల్లే అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించలేదని క్లారిటీ ఇచ్చారు స్నేహ.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు